జంగారెడ్డిగూడెం ఘటనపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. నిగ్గు తేల్చాలి !
2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా జరిగిన విషాదకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ప్రత్యేక టాస్‌ఫోర్స్ లో ముగ్గురు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందానికి ఏలూరు ఎస్పీ కిశోర్ నేతృత్వం వహించనుండగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణు ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉండనున్నారు. ఈ బృందం ఘటనపై మల్టీ డిసిప్లినరీ దృష్టి కోణంతో లోతుగా పరిశీలన జరిపి, సమగ్ర నివేదికను అందించనుంది.

దర్యాప్తు అంశాలు..
కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాల నేపథ్యంలో నమోదైన నాలుగు కేసులపై సమగ్రంగా పరిశీలన
విషమద్రవ్యాల ఉనికి, వాటి మూలాలు, తయారీ ప్రక్రియపై టెక్నికల్ విశ్లేషణ
పరిశీలన అవసరమైన మద్యం నమూనాలు, నిబంధనలు ఉల్లంఘించిన మద్యం అమ్మకాలు వంటి అంశాలపై రిపోర్ట్
బాధ్యులను గుర్తించటం, చట్టపరమైన చర్యలకు అవసరమైన ఆధారాలను సేకరించటం
భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు సాంకేతిక, పరిపాలనా సిఫార్సులు ఇవ్వడం












Click it and Unblock the Notifications