భీమవరం, వరంగల్, తిరుపతి, విజయవాడ ప్రజలకు ముఖ్య గమనిక
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నవాటిని పొడిగించారు. ఈ రైళ్లు ఏయే తేదీల్లో, ఎక్కడి నుంచి ఎక్కడకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
07091 కాజీపేట్ నుంచి తిరుపతికి ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు కాజీపేట్‌లో బయల్దేరి రాత్రి 10.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. సెప్టెంబరు 5వ తేదీ నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు పొడిగించారు.

07092 తిరుపతి నుంచి కాజీపేట్‌కు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.40 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.45 గంటలకు కాజీపేట్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు పొడిగించారు.
ఈ రైలు కాజీపేట్, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతుంది.
07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.
07632 నర్సాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 8.00 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.
07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపూర్ స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications