షిరిడీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నవాటిని పొడిగించారు. షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లేవారి సౌలభ్యం కోసం ప్రస్తుతం నర్సాపూర్ నుంచి నాగర్ సోల్ వరకు ఒక రైలు ప్రతిరోజు నడుస్తోంది. ఇది కాకుండా ప్రతి శుక్రవారం విజయవాడ నుంచి నాగర్ సోల్ వరకు ఒక రైలును నడిపిస్తున్నారు. ఈ రైళ్లు ఏయే తేదీల్లో, ఎక్కడి నుంచి ఎక్కడకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
07643 హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది.
రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పొడిగించారు.
07644 తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.
మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు తెల్లవారుజామున 5.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
2023 సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు పొడిగించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతుంది.

07698 విజయవాడ నుంచి నాగర్‌సోల్‌కు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
సాయంత్రం 4.15 గంటలకు విజయవాడలో బయల్దేరి తర్వాతరోజు మధ్యాహ్నం 2.10 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది.
సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు.
07699 నాగర్‌సోల్ నుంచి విజయవాడకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
రాత్రి 10.00 గంటలకు నాగర్‌సోల్‌లో బయల్దేరి తర్వాత రోజు సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.
విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కి, ఉద్గిర్, లాతూర్ రోడ్, పర్లి వైద్యనాథ్, గంగాఖేర్, పర్భణి, మన్వత్ రోడ్, సేలు, పార్టూరు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్ సోల్ స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications