బందరు, విజయవాడ, ఒంగోలు, కదిరి, తిరుపతి ప్రజలకు ముఖ్య గమనిక
పండగల సీజన్ ప్రారంభమవుతుండటంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయి? వాటి నెంబర్లు, రిజర్వేషన్ల పరిస్థితి తెలుసుకుందాం.
07095 మచిలీపట్నం నుంచి ధర్మవరం వరకు.. ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.
సాయంత్రం 5.40 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.20 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది.
సెప్టెంబరు 1వ తేదీ నుంచి సెప్టెంబరు 29వ తేదీ వరకు పొడిగించారు.

07096 ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు.. ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు ధర్మవరంలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 7.45 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
సెప్టెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పొడిగించారు.
బందరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లి రోడ్, కదిరి, ధర్మవరం స్టేషన్లలో ఆగుతుంది.
07509 హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు.. ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.
రాత్రి 7.25 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
సెప్టెంబరు 7వ తేదీ నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు పొడిగించారు.
07510 తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు.. ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు పొడిగించారు.
హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications