సికింద్రాబాద్, విజయవాడ, కాకినాడ ప్రజలకు ముఖ్య గమనిక
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-కాకినాడ టౌన్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి 9.00 గంటలకు సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07021) రైలు.. సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.00 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఇదే రైలు (07022) తిరుగు ప్రయాణంలో ఈ నెల 12 శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి.. తర్వాత రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
12వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్-కాకినాడ టౌన్ (07023) రైలు హైదరాబాద్‌లో బయలుదేరి.. తర్వాతరోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) 13వతేదీ శనివారం రాత్రి 10.00 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

రద్దీని నివారించేందుకు ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్-బ్రహ్మపుర్-వికారాబాద్ (07089/07090) రైలు ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వికారాబాద్-బ్రహ్మపుర్-సికింద్రాబాద్ (07091/07092) రైలు ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే విశాఖ- కర్నూలు మధ్య, శ్రీకాకుళం - వికారాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - కాకినాడ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.












Click it and Unblock the Notifications