విశాఖపట్నం ప్రజలకు బంపర్ ఆఫర్

ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే తిరుగుతున్న పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారులు వెల్లడించారు. విశాఖ-కర్నూలు(08585) ప్రత్యేక రైలు జనవరి 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.35గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1.20గంటలకు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు-విశాఖపట్నం(08586) ప్రత్యేక రైలు జనవరి 17, 24, 31 తేదీల్లో మధ్యాహ్నం 3.30గంటలకు కర్నూలు నుంచి బయలుదేరుతుంది. తర్వాతరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంది.

ఈ రైళ్లు కర్నూలు, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, ఉందానగర్, కాచిగూడ, మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.

special trains continue from bhubaneswar ro tirupathi

భువనేశ్వర్‌-తిరుపతి(02809) ప్రత్యేక రైలు జనవరి 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 1.30గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 7.35గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 7.37గంటలకు బయలుదేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో తిరుపతి-భువనేశ్వర్‌(02810) ప్రత్యేక రైలు జనవరి 14, 21, 28 తేదీల్లో రాత్రి 8.15గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.30గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.

ఖుర్దారోడ్, బలుగావ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+