• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనసేన పార్టీ ఓ విషపు చుక్క .. శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

|

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మాత్రం వదిలేలా లేదు . అప్పట్లో 'మా' లో సభ్యత్వం ఇవ్వకపోవటానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేసిన ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద రచ్చ చేసింది. ఆ సమయంలో ఆమెకు అనుకూలంగా మాట్లాడలేదనే కోపంతో ఇప్పటికీ పవన్‌ కళ్యాణ్ పై ఆమె విరుచుకు పడుతూనే ఉంది. అప్పట్లో ఆమె పవన్ కళ్యాణ్ ని తిట్టిన అసభ్య పదజాలం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు ఒక కారణం కాగా ఇక అప్పటి నుంచి నేటి వరకు ఆమె పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే ఉంది.

జనసేన పార్టీ విలీనం చేయమని ఒత్తిడి చేస్తున్నారన్న పవన్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేసిన శ్రీ రెడ్డి

జనసేన పార్టీ విలీనం చేయమని ఒత్తిడి చేస్తున్నారన్న పవన్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేసిన శ్రీ రెడ్డి

పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది శ్రీరెడ్డి. మా వివాదం తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ పెరగడంతో ఆమె చేసిన పోస్టులు త్వరగా వైరల్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీపై విషం కక్కిన శ్రీరెడ్డి ఏకంగా జనసేన పార్టీ ఒక విషపు చుక్క అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఒక జాతీయ పార్టీ తనను జనసేన పార్టీ విలీనం చేయమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై ఆమె కామెంట్ చేస్తూ జనసేన పార్టీ ఒక విషపు చుక్క, ఆ పార్టీని ఏ పార్టీలో విలీనం చేసినా సదరు పార్టీ నాశనమైపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిందెడు పాలలో ఒక విషపు చుక్క వేస్తే మొత్తం పాలన్నీ పాడైపోయే చందంగా జనసేన పార్టీని విలీనం చేస్తే కూడా అదే పరిస్థితి ఉంటుందని శ్రీరెడ్డి ఘాటుగా విమర్శించింది.

అసెంబ్లీలో కూర్చోటానికి సీటు లేదు నీకు .. ఇదంతా అవసరమా అని పవన్ ను టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి

అసెంబ్లీలో కూర్చోటానికి సీటు లేదు నీకు .. ఇదంతా అవసరమా అని పవన్ ను టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి

ఇక జనసేన పార్టీ మాకొద్దు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ , జగన్ ప్రభుత్వానికి '100 రోజుల టైం ఇస్తున్నా.. ఆ తరువాత నా ప్రతాపం' చూపిస్తా అంటూ ప్రభుత్వానికి రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ భవన నిర్మాణ కార్మికులకు ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిందని పేర్కొంటూ లేఖ రాశారు. ఇక ఈ లేఖపై స్పందించిన శ్రీ రెడ్డి వెంటనే ఆయనపై ఎటాక్ చేస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టేసింది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కనీసం అసెంబ్లీలో కూర్చోటానికి సీటు లేదు నీకు అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడింది. అంతేకాదు నీకు నాకు పెద్దగా పని లేదు కదా ..వచ్చి కూర్చో సొల్లు చెప్పుకుందాం అంటూ సెటైర్లు వేస్తూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

శ్రీ రెడ్డి వ్యాఖ్యల విషయంలో జనసైనికులు స్పందిస్తారా ?

శ్రీ రెడ్డి వ్యాఖ్యల విషయంలో జనసైనికులు స్పందిస్తారా ?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి మాటల తీరు , వాడుతున్న పదజాలం జనసేనానికి పెద్ద తలనొప్పిగా మారాయి. పవన్ ఏం మాట్లాడినా సరే వెంటనే తాను అందులో ఇన్వాల్వ్ అవుతూ తిట్టిపోస్తున్న తీరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాకింగ్ గా ఉంది. మరి శ్రీ రెడ్డి జనసేన పార్టీ గురించి, అధినేత పవన్ కళ్యాణ్ గురించి చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన సైనికులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి .

English summary
Sri Reddy, shocking comments on Jana Sena party, . After Pawan Kalyan said that a national party was pressuring him to merge with the Janasena party, she commented on the Pawan's comments , saying that the Janasena party is a poisonous drop and that the party will be destroyed if any party merges with it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more