'జగన్ హామీలతో టిడిపిలో ఉలిక్కిపాటు, నంద్యాలలో బాబు హామీల వర్షం'
నంద్యాల నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లేందుకు అధికార తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోందని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు.
అమరావతి: నంద్యాల నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లేందుకు అధికార తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోందని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు.
నంద్యాల నియోజకవర్గ ప్రజలు సీఎం చంద్రబాబు హామీలకు మోసపోవద్దని, అన్నీ మోసపూరితపు హామీలు ఇస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ హామీలను ఈసీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో విచ్చలవిడిగా తాయిలాలు ఇస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మంత్రి పర్యటిస్తూ, హామీల వర్షం కురిపిస్తున్నారని చెప్పారు. నంద్యాల ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

ప్లీనరీ సందర్భంగా వైయస్ జగన్ ఇచ్చిన తొమ్మిది హామీలు తెలుగుదేశం పార్టీకి వణుకు పుట్టిస్తున్నాయన్నారు. ఆ పార్టీ నేతల్లో ఉలిక్కిపాటు ప్రారంభమయిందని చెప్పారు. తాను ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.
Recommended Video

మంత్రులు జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం విలువలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. వైసిపి ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు.
అన్నొస్తున్నాడు అన్న మాటలకు టిడిపి నేతలు ఉలిక్కిపడుతున్నారని చెప్పారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు.












Click it and Unblock the Notifications