సస్పెన్షన్: ఆఫీసులోనే మందేసి, చిందేశారు
హైదరాబాద్: సికింద్రాబాదులోని తార్నాకలో గల మౌలాలి అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది మందేసి, చిందేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా అగ్నిమాపక కేంద్రంలోని ఫైర్ మెన్ అమరనాథ్ గౌడ్, ఏ మల్లేష్, ఓం నమశ్శివాయలతోపాటు ఫైరింజన్ డ్రైవర్ వీరాస్వామి మందు వేశారు. అనంతరం పాటలు పెద్దగా పెట్టుకుని చిందేశారు.
ఆ విషయాన్ని ఆగంతకులు ఫోటోలు తీసి, మీడియా వారికి అందజేశారు. ఆ ఫోటోలు మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ ఘటనపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు మౌలాలి అగ్నిమాపక కేంద్రం ఉన్నతాధికారి చంద్రశేఖర్‌తు సంప్రదించేందుకు ప్రయత్నించారు. వారికి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అని సమాధానం వస్తుంది. అలాగే మందేసి చిందేసిన సదరు నలుగురు మందుబాబుల సెల్‌ఫోన్లు కూడా మూగబోయాయి.

మౌలాలి అగ్నిమాపక కేంద్రంలో మద్యం తాగిన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. మద్యం తాగి, చిందేసిన సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అగ్నిమాపక సిబ్బందిని డిఎఫ్‌వో పాపయ్య సస్పెండ్ చేశారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన అగ్నిమాపక సిబ్బంది మద్యం మత్తులో నృత్యాలు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. నూతన సంవత్సరం వేడుకల పేరుతో డిసెంబర్ 31వ తేీద రాత్రి కార్యాలయంలోనే మద్యం సేవించి నృత్యాలు చేశారు.












Click it and Unblock the Notifications