చంద్రబాబుకు మోడీ ఫోన్, కెసిఆర్ దిగ్భ్రాంతి, కొందరి మృతుల వివరాలు...

హైదరాబాద్/రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద జరిగిన ప్రమాదం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.

తొక్కిసలాటలో 22 మంది భక్తులు మృతి చెందారు. భక్తుల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు గోదావరి తల్లి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బాబుకు ప్రధాని మోడీ ఫోన్

ప్రమాద ఘటన పైన ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి, సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకు మోడీ ఫోన్, కెసిఆర్ దిగ్భ్రాంతి, కొందరి మృతుల వివరాలు...

మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్రవారు

గోదావరి పుష్కరాల సందర్భంగా మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్రకు చెందిన వారు ఉన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 22మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు.

తక్కువ రద్దీ ఉన్న ఘాట్లకు వెళ్లాలి

భక్తులు తక్కువ రద్దీ ఉన్న ఘాట్లకు వెళ్లాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. ఘాట్ల వద్ద వరుస పాటించాలని విజ్ఞప్తి చేశారు. కోటగుమ్మం, కోటి లింగాలు మినహా మిగతా ఘాట్లకు వెళ్లాలని కోరారు. కాగా, ప్రమాదం జరిగిన ఘాట్ చిన్నగా ఉన్నట్లగా తెలుస్తోంది.

మృతుల్లో 13 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులను రాజమండ్రి ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి కామినేని శ్రీనివాస్‌ను బాధితులు చుట్టుముట్టారు.

మృతులు, క్షతగాత్రుల్లో కొందరు...

మృతులు...

రుద్రరాజు లక్ష్మి (పశ్చిమ గోదావరి జిల్లా యండగండి, 65 ఏళ్లు)
పార్వతమ్మ (విజయనగరం జిల్లా బాడంగి)
గొర్లె మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
పైడితల్లి (విజయనగరం జిల్లా పాల్తేరి)
కృష్ణవేణి ( తూర్పు గోదావరి జిల్లా వేమగిరి)

క్షతగాత్రులు... కృష్ణయ్య, రత్నం (యానాం)
వెంకట లక్ష్మి (రాజమండ్రి)
కృష్ణవేణి (విజయవాడ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+