కూతురినే రేప్ చేసిన తండ్రి : పాలల్లోనిద్రమాత్రలు కలిపి..

తూర్పుగోదావరి : చేరదీయాల్సిన చేతులు కామంతో కాటేశాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నదే గాక..! సదరు మహిళ కూతురిపై కూడా అత్యాచారానికి పాల్పడి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు ఓ కామాంధుడు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మలికిపురంలో నివాసముండే సిర్రా రాజు అనే వివాహితుడు తనతో కలిసి పనిచేస్తున్న కెల్లా లక్ష్మి అనే మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. వృత్తి రీత్యా హోటల్ లో పనిచేస్తున్న సిర్రా రాజుకు హోటల్ లోనే లక్ష్మి పరిచయమైంది. పరిచయం కాస్త సాన్నిహిత్యానికి దారి తీయడంతో ఇద్దరి మధ్య సహజీవనం కొనసాగుతోంది.

కెల్లా లక్ష్మికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా.. సిర్రా రాజుకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే పిల్లలందరినీ హాస్టల్లో చేర్పించిన సిర్రా రాజు.. తన భార్యను, లక్ష్మిని ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు పంపించాడు. ఇంటి వద్ద ఒక్కడే ఉంటుండడంతో గల్ఫ్ కు వెళ్తున్న సమయంలో తన కూతురిని సిర్రా రాజు వద్దే ఉంచి వెళ్లింది లక్ష్మి. లక్ష్మి కూతురును జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఆ బాలిక పైనే కన్నేశాడు సిర్రా రాజు.

 A Step Father raped daughter in east godavari district

ఈ నేపథ్యంలోనే... బాలికకు పాలలో మత్తు మందు కలిపి ఇస్తూ, రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. కాగా, గత పదిరోజులుగా నిద్రమాత్రలను సైతం పక్కనబెట్టి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం బయటకు పొక్కితే చంపేస్తానంటూ బాలికను బెదిరించారు. అయితే బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది.

అనంతరం గల్ఫ్ లో ఉన్న బాలిక తల్లి లక్ష్మికి ఉపాధ్యాయులు అసలు విషయాన్ని చేరవేయడంతో.. పాలకొల్లులో ఉండే బంధువు చల్లా నాగరాజుకు ఫోన్ కు చేసి తన కూతురును రక్షించమని ప్రాధేయపడింది లక్ష్మి. దీంతో బాలికను చేరదీసిన నాగరాజు, ఆ తర్వాత మలికిపురం పోలీస్ స్టేషన్ లో సిర్రా రాజుపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిర్రా రాజును అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+