తిరుమల లడ్డూ, దేవుడు కూడా కాపాడలేడు, విజిలెన్స్, సిట్ ఎంట్రీ, మంత్రి

శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దేవుడి ప్రసాదం విషయంలో కల్తీ వ్యాపారం చేసిన వారు తప్పించుకోలేరని, ఆ దేవుడు కూడా వీళ్ళని కాపాడరని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇకముందు తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా చూస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు టీటీడీ అధికారులు స్వచ్చమైన నెయ్యితో లడ్డు, అన్నప్రసాదాలు తయారు చేస్తున్నారని మంత్రి ఆనం నారాయణ రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో విజిలెన్స్, సిట్ అధికారుల నివేదిక ఆధారంగా బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Strict action based on SIT vigilance report in Tirumala Laddu adulterated ghee case

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగ రంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, తిరుమలకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేయకపోతే విజిలెన్స్ విచారణ నిలిపేయాలని వైసీపీ నాయకులు ఎందుకు హైకోర్టుకు వెళ్లారని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు.

గత టీటీడీ పాలకమండలిలో కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి సహకరించిన వారి వివరాలు మొత్తం బయటకు వస్తాయని, విజిలెన్స్ అధికారులు, సిట్ అధికారులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల విషయంలో ఎవరు ఎలాంటి తప్పులు చేసినా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వెనుకా ముందు ఆలోచించలేదని, ఆ భయం దగ్గర పెట్టుకొని అధికారులు సిన్సియర్ గా పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఇదే సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల విషయంలో టీటీడీ అధికారుల నుండి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+