పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మృతి
హైదరాబాద్: ప్రశ్నాపత్రంలో వచ్చిన కఠిన ప్రశ్నలను చూసిన... ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ది పరీక్ష రాస్తూ ఆకస్మాత్తుగా గుండె పోటుతో కుప్పకూలిపోయాడు.
ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు స్దానిక గీతాంజలి కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

గురువారం పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్ధి, పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే కుప్పకూలిపోయాడు. స్పందించిన కళాశాల సిబ్బంది విద్యార్ధిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మార్గ మధ్యంలో అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications