Sudha murthy: 30 ఏళ్ళుగా చీరలు కొనలేదు.. షాపింగ్ పిచ్చి ఉన్నవాళ్ళు ఆలోచించండి
షాపింగ్ పిచ్చి ఉన్న మహిళలు మన సమాజంలో చాలామంది ఉన్నారు. విపరీతంగా షాపింగ్ కు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా కుటుంబాలను ఆర్ధిక కష్టాల్లో పడేస్తున్నారు. ఆడవాళ్లే కాదు మగవాళ్ళల్లో కూడా షాపింగ్ చేసే పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్లకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి తాజాగా చెప్పిన ఒక విషయం పెద్ద కనువిప్పు అనే చెప్పాలి.
షాపింగ్ చేసే వాళ్ళు అవాక్కయ్యేలా సుధామూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
షాపింగ్ చేసే పిచ్చి ఉన్న వాళ్లకు ఆమె చెప్పిన విషయం అందరిని షాక్ కి గురిచేస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహము లేదు. ప్రముఖ రచయిత్రిగా, సామాజిక సేవలో తనదైన గుర్తింపు సాధించి రాజ్యసభ సభ్యురాలుగా ప్రస్తుతం పెద్దల సభలో తన గళాన్ని వినిపిస్తున్న సుధా మూర్తి తాజాగా పెద్దల సభలో చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

షాపింగ్ ఇష్టాన్ని కాశీలో వదిలి వచ్చానన్న సుధా మూర్తి
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె గత 30 సంవత్సరాలుగా తాను ఒక్క చీర కూడా కొనలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో సుధా మూర్తికి షాపింగ్ అంటే విపరీతమైన పిచ్చి ఉండేదని, తన కాశీయాత్ర తనను మార్చిందని సుధా మూర్తి పేర్కొన్నారు. కాశీ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి మనకు నచ్చింది వదిలేస్తే మంచిదని సాంప్రదాయం ఉందని, ఒకసారి వారణాసికి వెళ్ళినప్పుడు గంగానదిలో నేను షాపింగ్ ని వదిలేసానన్నారు
30 ఏళ్ళ నుండి ఒక్క చీర కూడా కొనలేదు
మరీ ముఖ్యమైన వస్తువులను మాత్రమే కొంటూ ఉంటానని గత 30 సంవత్సరాలలో ఒక్క చీర కూడా కొనలేదని, కట్టిన చీరలని మళ్లీ మళ్లీ కడుతూ ఉంటానని పేర్కొన్నారు. మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు చాలా నిరాడంబరంగా జీవించారని, అదే తనకు కూడా అలవాటైందని తెలిపారు. ఉన్నంతలో పొదుపు చేయాలన్నది మా కుటుంబం నుంచి నేర్చుకున్నాను అన్నారు.
పొదుపుగా జీవించాలని నేర్చుకున్నా
మా అమ్మ వార్డురోబ్ లో ఎనిమిది నుంచి పది చీరలు మాత్రమే ఉండేవని, మా బామ్మ దగ్గర నాలుగు చీరలు మాత్రమే ఉండేవని నేను కూడా వారిలా పొదుపుగా జీవించాలనుకున్నానని సుధా మూర్తి తెలిపారు. సుధా మూర్తి చెప్పిన మాటలను బట్టి షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళు ఆ అలవాటును మార్చుకుంటే మంచిదని అర్థమవుతుంది. 37 వేల కోట్ల ఆస్తి ఉన్నా పొదుపు చెయ్యాలి అని చెప్తున్న ఆమె మాటలు నిజంగా ఆచరణీయం.
ఆలోచించేలా చేస్తున్న దుబారా ఖర్చులు, షాపింగ్ మంచిది కాదన్న ఆమె మాటలు
ఇన్ఫోసిస్ వంటి గొప్ప సంస్థ అధినేత భార్య అయిన సుధా మూర్తి, డబ్బుకు ఏ మాత్రం కొదవ లేని సంపన్న మహిళ అయినా పొదుపుగా జీవించాలని చెప్పిన సూత్రం ప్రతి ఒక్కరూ పాటిస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో చాలా కుటుంబాలు దుబారా ఖర్చుల కారణంగా అనవసరమైన ఆర్థిక కష్టాల్లో పడుతున్నారు. దుబారా ఖర్చులలో ముఖ్యంగా తరచుగా షాపింగ్ చేయడం కూడా ఒకటి. ఇక ఈ అలవాటును మార్చుకోవడానికి సుధా మూర్తి చెప్పిన అంశాలు కాస్తయినా కనువిప్పు కలిగిస్తాయని భావిస్తున్నాం
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications