రాజ్యసభ: హరికృష్ణ టు లోకేష్ నో ఛాన్స్, సుజనాకు క్లియర్?

విజయవాడ: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి రాజ్యసభ పదవి సేఫ్‌గానే ఉండనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో సుజనతో పాటు పలువురి రాజ్యసభ టర్మ్ పూర్తవుతుంది. మరోసారి సుజనకు అవకాశం రాకపోవచ్చునని, ఆయన స్థానంలో మరొకరు రావొచ్చని ఊహాగానాలు వినిపించాయి.

సుజనా చౌదరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్ చెప్పాలనుకుంటే.... అంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో నారా లోకేష్ పేరు కూడా ఉంది. అదే సమయంలో కాపు ఉద్యమం నేపథ్యంలో కాపు నేతకు ఒకరికి పదవి దక్కవచ్చుననే చర్చ జరిగింది.

నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మిగతా మూడు స్థానాల్లో ఒకటి మిత్రపక్షం బిజెపికి పోతుందని చెబుతున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మాలా సీతారామన్‌లలో ఒకరికి ఏపీ బిజెపి తరఫున అవకాశం ఉండవచ్చునని భావించారు.

 Sujana Choudhary may opt second term for Rajya Sabha

అయితే, వెంకయ్య నాయుడు మరోసారి ఏపీ నుంచి ఆసక్తి చూపించకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే, టిడిపి తరఫున.. రెండింటిలో ఒకటి పక్కాగా సుజనకు దక్కుతుందని తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టిడిపిలో రాజ్యసభ తరఫున హరికృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాపు నేతకు ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. మిగిలిన ఒకటి కాపు నేతకు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. నారా లోకేష్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ.. సమయాన్ని చూసి ఆయనను ఏపీ కేబినెట్లోకే తీసుకుంటారంటున్నారు.

హరికృష్ణను చంద్రబాబు ప్రోత్సహించే అవకాశం లేదంటున్నారు. చంద్రబాబు అన్నీ లెక్కలు వేసుకొని తిరిగి సుజనా చౌదరికే అవకాశమిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. సుజన కూడా మరోసారి తనకే అవకాశం దక్కుతుందనే ధీమాలో ఉన్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+