సుజనా చౌదరికి తృటిలో తప్పిన పెను ప్రమాదం: సీటు బెల్టే కాపాడింది
విశాఖపట్నం: విమానాశ్రయంలో దిగి, తన కాన్వాయ్ లో నగరానికి వస్తున్న కేంద్రమంత్రి సుజనా చౌదరికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నగర పరిధిలోని ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై సుజనా కాన్వాయ్‌లోకి గుర్తు తెలియని రెండు కార్లు ఆకస్మికంగా వచ్చాయి.
వాటిని కాన్వాయ్ నుంచి వేరు చేసేందుకు ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో, దాని వెనుకే వస్తున్న సుజనా కారు బలంగా ఢీకొంది. ఆ సమయంలో మంత్రి ముందు సీట్లో సీట్ బెల్టు పెట్టుకుని కూర్చుని ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇక అదే వాహనంలో వెనుక సీట్లో ఉన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావుకు కూడా ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు స్వల్పంగా దెబ్బతింది. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంత్రి కాన్వాయ్‌లోకి వచ్చిన కార్లు ఎవరివి, ఎందుకు వచ్చారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications