ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీ మీదగా నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను అధికారులు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. విశాఖ-చెన్నై ఎగ్మోర్ (08557) ప్రత్యేక రైలు ఈనెల 27 నుంచి జూన్ 29 వరకు నడుస్తుంది. ప్రతి శనివారం రాత్రి ఏడుగంటలకు విశాఖలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.45 గంటలకు ఎగ్మోర్ చేరుకుంటుంది. చెన్నై ఎగ్మోర్-విశాఖ (08558) రైలు ఈనెల 18వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎగ్మోర్ లో బయలుదేరి రాత్రి 10.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. అలాగే విశాఖ-హతియా (08555) ప్రత్యేక రైలు ఈనెల 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. తర్వాత రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు హతియా వెళుతుంది. హతియా-విశాఖ(08556) ప్రత్యేక రైలు ఈనెల 29 నుంచి జులై 1 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4.00 గంటలకు హతియాలో బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 9.50గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లలో ఆగుతుంది.

కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేశారు. భావ్ నగర్ - కాకినాడ పోర్టు (12756) రైలును మే 4, 11, 18, 25 తేదీల్లో గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదగా దారి మళ్లించి నడుపుతున్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వేసవి రద్దీ దృష్ట్యా రైలు ప్రయాణాలు పెరుగుతుండటంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ చొరవ తీసుకొని ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పించడంపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications