‘సంతోషం అవార్డ్స్’కు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన సురేష్ కొండేటి
సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి ప్రతి ఏటా నిర్వహించే సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, సురేష్ కొండేటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం సాయంత్రం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకొని, ఆహ్వాన పత్రికను అందజేశారు.
సీఎం అభినందనలు:
చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉండే చంద్రబాబు, ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు చిత్ర పరిశ్రమలోని ప్రతిభను ప్రోత్సహిస్తాయని చెబుతూ సురేష్ కొండేటిని అభినందించారు. సురేష్ కొండేటి ఆహ్వానంపై సీఎం సానుకూలంగా స్పందించారు.

కార్యక్రమం వివరాలు:
ఈ కార్యక్రమానికి ఆదిత్య మ్యూజిక్ మ్యూజిక్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే, సూర్య సిమ్, విజయ వారహి మూవీస్, వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వెన్ లాక్ గ్రూప్ వంటి సంస్థలు ఈ వేడుకకు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అవార్డుల కార్యక్రమం గతంలో కన్నా అద్భుతంగా ఉంటుందని, అన్ని భాషల నుంచి మంచి సహకారం లభిస్తోందని సురేష్ కొండేటి తెలిపారు.












Click it and Unblock the Notifications