ఏపీ నుంచి రాజ్యసభకు ప్రభు: అమరావతి టు బెంగళూరు హైస్పీడ్ రైల్ లైన్
విజయవాడ: విదేశీ సహకారంతో విశాఖపట్నం - చెన్నై, బెంగళూరు - అమరావతి మధ్య హైస్పీడు రైలు మార్గాలు నిర్మిస్తామని, ఇప్పటికే ఫ్రెంచి అధికారులతో మాట్లాడామని, ఇతర దేశాలతో కూడా చర్చించి సరైన భాగస్వామిని ఎంపిక చేసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు శనివారం అన్నారు.
ఆయన ఏపీ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆయన ఇందుకు సంబంధించిన పత్రాలు తీసుకున్నారు. శనివారం ఏపీ సీఎం చంద్రబాబుతో మూడు గంటల పాటు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాజమహేంద్రవరం హేవ్ లాక్ వంతెనను రాష్ట్ర పర్యటక శాఖకు అప్పగిస్తామని చెప్పారు. అమరావతికి వివిధ ప్రాంతాల నుంచి అనుసంధానతను పెంచేందుకు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిస్తున్నామని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు త్వరలో రెండు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశ పెడతామన్నారు.
రూ.1000 కోట్ల పెట్టుబడితో కర్నూలు, తిరుపతిలలో కొత్తగా రెండు రైల్వే వర్క్ షాపులు, విశాఖలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలో అత్యాధునిక టెర్నిల్ ఏర్పాటు చేసే అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. ఓడ రేవులు, విమానాశ్రయాలు, రోడ్డు మార్గాలు కలుపుతు రవాణా ప్రాజెక్టులు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశం పరిశీలనలో ఉందన్నారు.

సురేష్ ప్రభు
ఏపీకి రైల్వే జోన్ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఎపి నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ప్రభు శనివారం విజయవాడకు చేరుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఎపి నుంచి టిక్కెట్ ఇచ్చి గెలిపించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైల్వే అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రులు కామినేని శ్రీనివాస్, పుల్లారావు, ఎంపీ నాని తదితరులు సమావేశమయ్యారు.

సురేష్ ప్రభు
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశం సుమారు మూడు గంటలపాటు కొనసాగింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీని అనేకసార్లు కలిసి, రాష్ట్ర సమస్యలను వివరించారన్నారు. రైల్వేపరంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తామన్నారు.

సురేష్ ప్రభు
రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని ప్రభు చెప్పారు. రైల్వే శాఖలో కొత్తగా ప్రవేశపెట్టనున్న ప్రాజెక్ట్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపడతామని, నెల రోజుల్లో దీనికి తుది రూపం ఇస్తామని ఆయన చెప్పారు. ఎపిలో పోర్టులు, ఎయిర్‌పోర్టులను కలుపుతూ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలియచేశారు.

సురేష్ ప్రభు
ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని, ఎగుమతుల, దిగుమతులకు కేంద్ర బిందువు కాబోతోందని ప్రభు చెప్పారు. రైల్వే అధికారులు ముఖ్యమంత్రితో తరచు సమావేశమవుతూ పురోగతిని వివరిస్తున్నారన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 50కోట్ల రూపాయలతో రైల్వే ప్లాట్‌ఫారాలను తీర్చిదిద్దనున్నామన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతామని హామీ ఇచ్చారు. రైలు-నీరు ప్రాజెక్ట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామని, దీనివలన చాలామందికి ఉపాధి లభిస్తుందన్నారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లు, కొత్త రైళ్ళకు సంబంధించిన అనేక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు వినతిపత్రం అందచేశారు.

సురేష్ ప్రభు
రాజధాని అమరావతిని ప్రధాన రైలు మార్గాలతో కలపాలని కోరినట్టు సిఎం చెప్పారు. అమరావతి నుంచి బెంగళూరుకు సూపర్ ఫాస్ట్ రైలును నడపాలని విజ్ఞప్తి చేసినట్టు సిఎం చెప్పారు. ఎపిలో రైల్వే జోన్ ఏర్పాటు విభజన చట్టంలో ఉందని, దానిని అమలు చేయాలని కోరామని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు సుమారు రెండు లక్షల 57 వేల మంది వస్తారని, సెలవు రోజుల్లో, ప్రత్యేక రోజుల్లో పుష్కరాలకు ఐదు లక్షల మంది వరకూ వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications