• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబోయే భర్తకు సర్ప్రైజ్ గిఫ్ట్; కత్తితో గొంతుకోసి పరారైన యువతి; ఏపీలో షాకింగ్ ఘటన

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు మనుషుల్లో పైశాచిక ప్రవర్తన పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలు కూడా తామేమీ తీసిపోమన్నట్టుగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ప్రేమించలేదని కొందరు, ప్రేమిస్తున్నారని మరికొందరు, ప్రేమ వివాహాల పేరుతో ఇంకొందరు, ఘర్షణలతో మరికొందరు వివిధ కారణాలతో నిత్యం దారుణ హత్యలకు తెగబడుతున్నారు.

అనకాపల్లి రావికమతంలో దారుణ ఘటన

అనకాపల్లి రావికమతంలో దారుణ ఘటన


తెలంగాణ రాష్ట్రంలో ఒక తండ్రి తన కూతురు తనకు ఇష్టం లేని యువకుడిని వివాహం చేసుకున్న కారణంతో సుపారీ ఇచ్చి మరీ అల్లుడిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ కుమార్తె వెంట పడుతున్న యువకుడిని ఇంటికి పిలిచి మరీ చీకటి గదిలో బంధించి, ఉప్పెన సినిమా తరహాలో రోకలిబండతో మర్మాంగాలను చితక్కొట్టిన ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఇక ఈ ఉదంతాలు మర్చిపోకముందే తాజాగా అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలంలో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేని యువతి

పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేని యువతి

పెద్దలు ఇష్టం లేని పెళ్లి కుదర్చటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఊహించని దారుణానికి పాల్పడింది. బచ్చన్నపేట మండలం కొమ్మలపూడి గ్రామంలోని అమరపురి సమీపంలో కాబోయే భర్త గొంతు కోసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రావికమతం గ్రామానికి చెందిన 22 సంవత్సరాల వియ్యపు పుష్పకు, మాడుగుల మండలం ఎంకే వల్లాపురం గ్రామానికి చెందిన 28ఏళ్ళ అద్దేపల్లి రామానాయుడుతో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. రామానాయుడు హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ లో పరిశోధకుడిగా పని చేస్తున్నాడు.

సర్ప్రైజ్ ఇస్తానని పిలిచి కళ్ళు మూసుకొమ్మని గొంతు కోసిన యువతి

సర్ప్రైజ్ ఇస్తానని పిలిచి కళ్ళు మూసుకొమ్మని గొంతు కోసిన యువతి

రామానాయుడును పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని పుష్ప ఆ విషయం అతనికి నేరుగా చెప్పకుండా కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అని రామానాయుడుకు ఫోన్ చేసింది. బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడి వద్ద గల అమరపురి సమీపంలో కలుసుకుందామని చెప్పింది. పెళ్లి చేసుకునే యువతి పర్సనల్ గా మాట్లాడాలి రమ్మని చెప్పడంతో ఎంత సంతోషంగా వెళ్ళాడు రామానాయుడు. అక్కడ యువతి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను కళ్ళు మూసుకో అని చెప్పడంతో రామానాయుడు కళ్ళు మూసుకున్నాడు. ఇక ఈ సమయంలో పుష్ప ఆమె వెంట తెచ్చిన కత్తితో రామానాయుడు గొంతు కోసింది.

యువకుడి పరిస్థితి విషమం ..యువతి పరారు

యువకుడి పరిస్థితి విషమం ..యువతి పరారు

తీవ్ర రక్తస్రావమైన రామానాయుడు సంఘటనా స్థలంలో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత పుష్ప అక్కడి నుండి పరారైంది. రక్తస్రావంతో పడి ఉన్న రామానాయుడును గమనించిన స్థానికులు అతడిని రావికమతం పీహెచ్సీకి తరలించారు. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామానాయుడు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబోయే భర్త గొంతు కోసి పరారైన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The incident took place in Anakapalli Ravikamatam in AP where a young woman who called to give a surprise gift to her fianc stabbed him with a knife and fled as She doesn't want to marry the young wan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X