సర్వే: నేనున్నాంటూ వచ్చిన భార్య, రావద్దని భర్త
హైదరాబాద్: తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా విచిత్రమైన విషయాలు బయటపడుతున్నాయి. కుటుంబ కలహాలు కూడా వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో ఇంతకాలం కటుంబానికి దూరంగా ఉన్న మహిళ ఇప్పుడు తాను ఉన్నానంటూ, కుటుంబంలో తనను భాగస్వామిని చేయాలంటూ వచ్చింది.
మూడేళ్లుగా కనీసం ముఖం కూడా చూపించలేదని, తన కుమారుడిని కూడా తనకు చూపించలేదని, ఇప్పుడు రావడం ఎందుకు అని భర్త వ్యతిరేకించాడు. అతని తల్లిదండ్రులు కూడా ఆమెను నిరాకరించారు దీంతో తగాదా చోటు చేసుకుంది.

ఆ సంఘటనకు సంబంధించిన వార్తాకథనాలు, జరిగిన వివాదానికి సంబంధించిన క్లిప్పింగులు తెలుగు టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. తమపై ఆమె తప్పుడు కేసులు పెట్టిందని భర్త, అత్తామామలు ఆరోపిస్తున్నారు. హత్యాయత్నం, 498 కేసులు తమపై పెట్టిందని వారు చెప్పారు.
ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోర్టుకు కూడా వెళ్లినట్లు ఆమె భర్త చెప్పాడు. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆ మహిళ ఇంటి ముందు బైఠాయించింది. అయితే, ఇరుగుపొరుగువారు ఆ మహిళనే తప్పు పడుతున్నారు. కేవలం ఆస్తి కోసమే ఆమె ఇప్పుడు వచ్చిందని అత్తామామలు అంటున్నరు.












Click it and Unblock the Notifications