Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ పై ముద్రగడ ఆలోచనలో మార్పు - ఢిల్లీ ఎఫెక్ట్..!?

ఏపీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు ఓకే అయినట్లు చెబుతున్నా సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ ఇతర పార్టీల కంటే ఎన్నికల యుద్దంలో వేగంగా కదులుతోంది. టీడీపీ, జనసేన అభ్యర్దుల ఎంపిక కొలిక్కి రాలేదు. బీజేపీ నిర్ణయం కోసం ఈ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. అటు పొత్తుల చర్చలు చేస్తూనే..బీజేపీ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. కాపు ఉద్యమ నేత ముదగ్రడ జనసేనలో చేరటం ఖాయమని భావించిన వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

మారుతున్న లెక్కలు : ఈ సారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కీలకం కానున్నాయి. ఉభయ గోదావరిలో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీకే అధికారం ఖాయమనే నమ్మకం ఉంది. ఇక్కడ పవన్ సహకారంతో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. జనసేన ఇక్కడే ఎక్కువ సీట్లు పొత్తులో తీసుకోవాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందనే దిశగా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ, బీజేపీ విషయం తేల్చకుండా పెండింగ్ లో పెట్టింది. దీంతో, రెండు పార్టీల అభ్యర్దుల ఖరారు ప్రక్రియ ముందుకు కదలటం లేదు. గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో, ఎవరికి సీట్లు దక్కుతాయనే ఉత్కంఠ రెండు పార్టీలోనూ కనిపిస్తోంది.

Suspense continues on Mudragada joining in Janasena see deets

ముద్రగడ ఎటువైపు : ఇదే సమయంలో ముద్రగడ రాజకీయ ప్రయాణం పైన తూర్పు గోదావరిలో చర్చ మొదలైంది. 2014 నుండి ఏ పార్టీ లోనూ చేరకుండా ఉండిపోయిన ముద్రగడ పద్మనాభంతో జ‌న‌సేన ఇన్‌ఛార్జ్ బొలిశెట్టి శ్రీ‌నివాస్‌ చర్చలు జరిపారు. పవన్ స్వయంగా వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే చర్చ జరిగింది. కానీ, ముద్రగడ ఎంట్రీ పైన ఇంకా స్పష్టత రాలేదు. ముద్రగడ చేరిక విషయాన్ని పవన్ ప్రస్తుతానికి పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడ ను పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా కాపు ఓటింగ్ బ్యాంకు మరింత బలోపేతం అవుతుందని అంచనా వేసారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ తో పాటు, ఆయన కుమారుడు ముద్రగడ గిరికి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. కానీ, అనూహ్యంగా ముద్రగడ చేరిక అంశం ఆగిపోయింది.

Suspense continues on Mudragada joining in Janasena see deets

కొత్త సమీకరణాలు : ముద్రగడతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. దీని కారణంగానే ముద్రగడతో భేటీకి పవన్ దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముద్రగడ మౌనం వెనుక కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులే కారణమని సమాచారం. టీడీపీ, జనసేన పొత్తలో భాగంగా సీట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవటంతో ముద్రగడకు పవన్ ఎలాంటి హామీ ఇవ్వలేక ఆయన వద్దకు వెళ్లలేదనేది మరో వాదన. అయితే, ఇప్పుడు గోదావరి జిల్లాలో మారుతున్న సమీకరణాలు.. ముద్రగడ చేరిక పైన కొనసాగుతున్న సస్పెన్స్ తో గోదావరి తీరాన రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+