ఏపీ పరిషత్ ఎన్నికలపై వీడని ఉత్కంఠ-ఆగస్టు 4కు హైకోర్టు విచారణ వాయిదా

ఏపీలో ఎంపీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ మరింతకాలం కొనసాగేలా ఉంది. ఇప్పటికే పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా.. అక్కడా వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో హైకోర్టు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే తన రిటైర్మెంట్ లోపు తగినంత సమయం లేకపోవడంతో ఆయన నిర్వహించలేదు. ఆ తర్వాత ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ వచ్చీ రాగానే నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు వారం రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించేసారు. దీంతో ఇధి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దమంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

suspense continues over ap mptc, zptc elctions as high court postponed hearing to august 4

Recommended Video

    TDP Senior Minorty Leader Ziauddin Joined In YSRCP In Presence Of CM | Oneindia Telugu

    సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగలేదనే కారణంతో హైకోర్టు వీటిని రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం, ఎస్ఈసీ ఇరుకునపడ్డాయి. ఆ తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ తీరుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసినా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే హైకోర్టు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేయడంతో అప్పటి వరకూ ఉత్కంఠ కొనసాగనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+