భూమా మృతిపై వైసిపి ఎమ్మెల్యే వైవీ, అఖిలప్రియ బాధ్యత ఇక ఎస్వీదే

భూమా నాగిరెడ్డి మృతి తనను ఎంతగానో కలచి వేసిందని వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందన్నారు. భూమా పిల్లలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు.

ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి మృతి తనను ఎంతగానో కలచి వేసిందని వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందన్నారు. భూమా పిల్లలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై సుబ్బారెడ్డి మండిపడ్డారు. మూడేళ్ల నుంచి సంభవిస్తున్న వరుస కరవులతో ప్రకాశం జిల్లా రైతాంగం కకావికలమైందని తెలిపారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకుండా రైతులు అల్లాడిపోతున్నారన్నారు.

YSR Congress Party MLA SV Mohan Reddy on Telugudesam Party leader and MLA Bhuma Nagi Reddy's death.

అయినప్పటికీ సీఎం చంద్రబాబు రైతుల కష్టాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనికి తోడు వలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏమాత్రం లేదని సుబ్బారెడ్డి విమర్శించారు.

2018 నాటికల్లా వలిగొండను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ, ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి 2018 నాటికి తాగు, సాగు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైసీపీ తరపున ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు.

భూమా పిల్లల బాధ్యత ఎస్వీ మోహన్ రెడ్డిదే!

మేనమామ తండ్రితో సమానం అంటారు. ఇప్పుడా బాధ్యత కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై ఎంతో ఉందని అంటున్నారు. భూమా నాగిరెడ్డికి ఆయన స్వయానా బావమరిది. దివంగత భూమా శోభానాగిరెడ్డికి సొంత అన్న.

భూమా దంపతులకు అఖిలప్రియ, మౌనిక కూతుళ్లు. భూమా జగత్‌విఖ్యాత రెడ్డి కుమారుడు సంతానం. రెండేళ్ల క్రితం భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె స్థానంలో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఏకగ్రీవమయ్యారు.

అఖిల ప్రియ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లినా, పార్టీ సమావేశాలకు వెళ్లినా, ఇతర శుభకార్యాలకు వెళ్లినా నాన్న చాటు కూతురుగా వెళ్లేది. అన్నింటా అమ్మ, నాన్నలా ఆయన తోడుగా ఉండేవారు. అమ్మ చనిపోయిన రెండున్నరేళ్లకే నాన్న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. అమ్మ, నాన్నలను కోల్పోయిన అఖిలప్రియ, మౌనిక, విఖ్యాత్‌రెడ్డిలను మేనమామ అయిన ఎమ్మె ల్యే ఎస్వీ మోహన్ రెడ్డే అమ్మా నాన్నల్లా ఆదరించి అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపించే బాధ్యత ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+