శ్వేతాబసు ప్రకటన కాదా? బాధితురాలే, అరెస్ట్ కాదు
హైదరాబాద్: వ్యభిచార కూపంలోకి వెళ్లడం పైన శ్వేతాబసు వివరణ ఇచ్చినట్లుగా బుధవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆ ప్రకటన విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంది. అక్కడ ఉన్న ఆమె ఎలాంటి ప్రకటన విడుదల చేసేందుకు అవకాశం లేదని పోలీసులు చెప్పినట్లుగా సమాచారం.

న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసిన అనంతరం ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచామని, దీనిని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నడుపుతోందని పోలీసులు తెలిపారని తెలుస్తోంది. అక్కడే ఆమె మరికొద్ది రోజులు ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో ఆమె ఎలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని, మీడియాతో మాట్లాడే అవకాశం లేదని పోలీసులు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, నాలుగు రోజుల క్రితం శ్వేతాబసు వ్యభిచార కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. పోలీసులు ఆమెను అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరు పర్చారు. అనంతరం రెస్క్కూ హోంకు తరలించారు.
మరోవైపు, రిహాబిలేషన్ సెంటర్‌కు తరలించిన శ్వేతాబసుది అరెస్టు కాదని పోలీసులు చెప్పారని తెలుస్తోంది. ఈ కేసులో శ్వేతాబసు బాధితురాలని చెప్పారు. రెస్క్యూ హోంకు తరలించే ముందు ఆమెను ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్సకు పంపించినట్లు చెప్పారు. కాగా, ఈ రెస్క్యూ హోంలో ఆమె మూడు నెలలు ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications