వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హోంమంత్రిగా తానేటి వనితకు మోదం; మాజీమంత్రి సుచరితకు ఖేదం.. ఇద్దరూ ఏం చెప్తున్నారంటే!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మంత్రులకి శాఖలు కేటాయింపు చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోంశాఖ ఎవరికి ఇస్తారు అన్న చర్చ జోరుగా సాగిన నేపథ్యంలో హోం శాఖ మంత్రిగా మరోమారు దళిత మహిళకే అవకాశాన్ని ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మొదట హోం శాఖా మంత్రిగా రోజాకు అవకాశం ఇస్తున్నారని ప్రచారం జరిగినా ఫైనల్ గా హోం మంత్రిగా సామాజిక సమీకరణాల మేరకు నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ . జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదట్లో మంత్రివర్గ ఏర్పాటులోనూ ఎస్సీ మహిళకు హోంశాఖ కట్టబెట్టిన సీఎం జగన్ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలను తానేటి వనితకు అప్పగించారు. అయితే జగన్ నిర్ణయంతో ఒక దళిత మహిళకు మోదం ,మరో దళిత మహిళకు ఖేదం మిగిలాయి.

టీడీపీ మరో 40ఏళ్లు ప్రతిపక్షంలోనే; తుప్పు- పప్పు.. మీకా దమ్ముందా? ఏకిపారేసిన సాయిరెడ్డిటీడీపీ మరో 40ఏళ్లు ప్రతిపక్షంలోనే; తుప్పు- పప్పు.. మీకా దమ్ముందా? ఏకిపారేసిన సాయిరెడ్డి

తనపై జగన్ నమ్మకానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తానేటి వనిత

తనపై జగన్ నమ్మకానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తానేటి వనిత

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన తానేటి వనిత కు గత కేబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్, ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించడంతో మంత్రి తానేటి వనిత రెండవ సారి తనకు జగన్ అవకాశం కల్పించడం పై సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి తన హోంశాఖను కేటాయించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు తానేటి వనిత.

రెండోసారి క్యాబినెట్ లో స్థానం ఊహించలేదు... బాధ్యత రెట్టిపు అయ్యింది: తానేటి వనిత

రెండోసారి క్యాబినెట్ లో స్థానం ఊహించలేదు... బాధ్యత రెట్టిపు అయ్యింది: తానేటి వనిత


మహిళల పట్ల సీఎం వైఎస్ జగన్ కు మంచి విజన్ ఉందని, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ఏపీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో దిశ యాప్ తో పాటు, మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని మంత్రి తానేటి వనిత వెల్లడించారు. గతంలో తాను మహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశానని గుర్తు చేసుకున్న వనిత మహిళల భద్రత కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ వెల్లడించారు. తనకు రెండోసారి కేబినెట్లో చోటు దక్కుతుందని ఊహించలేదని, రెండో సారి కూడా కేబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించడంతో తన బాధ్యత మరింత రెట్టింపు అయిందని తానేటి వనిత పేర్కొన్నారు.

సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటాను: తానేటి వనిత

సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటాను: తానేటి వనిత


తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, టీనేజ్ అమ్మాయిలు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం దిశ యాప్ తీసుకువచ్చి, దిశ చట్టం ద్వారా మహిళలకు భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. దిశ చట్టానికి సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని పేర్కొన్న తానేటి వనిత, మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి కూడా తన వంతు కృషి చేస్తానని తానేటి వనిత స్పష్టం చేశారు.

 తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటంపై మాజీ మంత్రి మేకతోటి సుచరిత అసంతృప్తి

తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటంపై మాజీ మంత్రి మేకతోటి సుచరిత అసంతృప్తి


ఇదిలా ఉంటే 2019 జగన్ క్యాబినెట్ లో హోం మంత్రిగా మేకతోటి సుచరిత కి అవకాశం కల్పించారు సీఎం జగన్. అయితే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో హోంమంత్రి సుచరిత కూడా చోటు దక్కలేదు. ఆమె స్థానంలో గతంలో మంత్రిగా ఉన్న తానేటి వనితకు అవకాశం కల్పించారు. దీంతో సుచరిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కేబినెట్లో ఉన్న 11 మంది పాత వారికి అవకాశం కల్పించి తనకు అవకాశం ఇవ్వకపోవడంపై సుచరిత తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

 ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని పేర్కొన్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత

ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని పేర్కొన్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత


తనకు మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా, గతంలో మంత్రులు గా అవకాశం ఇచ్చిన 11 మంది పాత వారికి అవకాశం కల్పించడం పై ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. ఈరోజు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కానీ పార్టీలో మాత్రం కొనసాగుతానని సుచరిత వెల్లడించారు. వైసిపి లో ఉన్న ఇతర నాయకులు ఎవరూ రాజీనామాలు చేయొద్దని ఆమె సూచించారు. అయితే ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరితకు మద్దతుగా ప్రజాప్రతినిధులు కొందరు రాజీనామాలు చేశారు.

English summary
Minister Taneti Vanitha was happy as AP Home Minister. She said she was indebted to Jagan for the rest of her life and would focus on women safety. Former minister Sucharita is in disatisfaction, She says she will resign as an MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X