ఎన్టీఆర్ వర్థంతి: తారక్, కల్యాణ్ రామ్ ఎమోషనల్.. ఎన్టీఆర్ ఘాట్‌కు రాని చంద్రబాబు.. ఎందుకంటే!
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఎన్టీఆర్ సమాధి వద్ద పూలవాల వేశారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యక్రతలు కూడా ఘాట్‌కు చేరుకొని అంజలి ఘటించారు.
Recommended Video

తారక్ భావోద్వేగం
తన తాత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తారక్ భావోద్వేగానికి లోనయ్యారు. నేటితో ఆయన తమకు దూరమై 24 ఏళ్లు అవుతోందని చెప్పారు. ఆయన భౌతికంగా తమతో లేకున్నా.. జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉంటాయన్నారు. ఆయన బాటలోనే తాము నడుస్తున్నామన్నారు. ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆయన అభిమానులు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు.

మంగళగిరిలో
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. లోకేశ్, కళా వెంకట్రావ్ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

నేపథ్యం..
నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్‌కు తల్లి కృష్ణ అనే పేరు పెట్టాలనుకొన్నారు. కానీ ఆమె సోదరుడు తారక రాముడి బాగుంటుంని చెప్పడంతో నామకరణం చేశారు. అది తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో, తర్వాత విజయవాడ ఆర్ ఆర్ కాలేజీలో చదివారు. అక్కడే తెలుగు విభాగ అధిపతి విశ్వనాథ సత్యనారాయణ నాటకములో ఆడవేషం వేయమని రామారావుని కోరారు. మీసాలు తీసేందుకు అంగీకరించకపోవడంతో మీసాల నాగమ్మ అని పిలిచారు. మేనమామ కూతురు బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నాక.. చదువు అబ్బలేదు. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చేరి.. నాటకాలు వేసేవారు.

ప్రభుత్వ ఉద్యోగం వదిలి..
రామారావు సబ్ రిజిస్ట్రార్‌గా కెరీర్ ప్రారంభించారు. కానీ సినిమాల్లో నటించాలనే తృష్ణతో సినిమాల వైపు వెళ్లారు. మనదేశం అనే సినిమాలో తొలిసారి కెమెరా ముందు నటించారు. కానీ వాస్తవానికి సినిమా ఒప్పందం మాత్రం పల్లెటూరి పిల్ల కోసం సినీ రంగంలో అడుగిడారు. 1951లో పాతాల భైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం సినిమాలతో సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

టీడీపీ ఆవిర్భావం
1982లో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ చైతన్యరథం మీద ప్రచారం సాగించారు. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ 199 స్థానాల్లో విజయం సాధించి.. అధికారం చేేపట్టింది. 1985లో మధ్యంతర ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. 1989లో వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1993లో ఎన్టీఆర్ జీవితం కీలక మలుపు తిరిగింది. తన జీవిత కథ రాస్తోన్న లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. దీంతో కుటుంబంలో విభేదాలు పొడచూపాయి. తర్వాత లక్ష్మీపార్వతి పార్టీలో కలుగజేసుకోవడంతో.. అప్పటి నేతలు ఎన్టీఆర్‌కు చెక్ పెట్టడంతో, గుండెపోటుతో మహానటుడు దివికెగాడు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications