కొడాలి నానిపై పోటీకి బాలయ్య సై.. గుడివాడలో ఇక దబిడి దిబిడే....!!

గుడివాడలో కొడాలి నాని ఉన్నాడు...గుర్తు పెట్టుకోండి.. ఇదీ అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని చేసిన హెచ్చరిక. టీడీపీ అధినేత..ఆయన తనకుడు లోకేష్ ను విమర్శించాలంటే ఆ పని వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని..రోజా కు అప్పగిస్తారు. వారిద్దరూ టీటీపీ నుంచి వచ్చిన వారే. ఇక, ఈ మధ్య కాలంలో కొడాలి నాని మీడియ ముందుకు వచ్చి చంద్రబాబు - లోకేష్ గురించి మాట్లాడటం మొదలు పెడితే దానికి అంతే లేదు. చంద్రబాబు- లోకేష్ పైన ఆ స్థాయిలో నాని విరుచుకుపడుతున్నా...ఆయనకు తిరిగి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే నేతలు టీడీపీలో కనిపించటం లేదు.

 అసెంబ్లీలోకి కొడాలి రాకూడదంటూ..

అసెంబ్లీలోకి కొడాలి రాకూడదంటూ..

ఇక, గుడివాడ నియోజ కవర్గంలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనేది చంద్రబాబు ప్రధమ - తక్షణ కర్తవ్యంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి దేవినేని అవినాశ్ ను పోటీకి దింపినా...కొడాలి నాని గెలుపుకు ఆపలేక పోయారు. గడివాడ ఒక రకంగా టీడీపీకి కంచుకోట..కానీ, ఇప్పుడు కొడాలి నాని కోటగా మారిపోయింది. 2004 , 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొడాలి నాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నందమూరి హరిక్రిష్ణ..జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఇదే నియోజకవర్గం నుంచి 1983,1985 రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

 నాడు టీడీపీకి..నేడు నానీకీ..

నాడు టీడీపీకి..నేడు నానీకీ..

కొడాలి నాని 2009 లో గెలిచిన తరువాత జరిగిన రాజకీయ పరిణా మాల్లో కాంగ్రెస్ పైన పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయటంతో ఆయనపైన అనర్హత వేటు పడింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ..ప్రస్తుతం మంత్రి అయ్యారు. శాసనసభలోనూ సీఎం జగన్ కొడాలి నానితో తన అనుబంధం గురించొ గొప్పగా చెప్పారు. అయితే, కొరకరాని కొయ్యగా మారుతున్న గుడివాడలో రానున్న ఎన్నికల్లో అయినా ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది.

గుడివాడ బరిలో బాలయ్య..

గుడివాడ బరిలో బాలయ్య..

ఇందుకోసం ఆయన నందమూరి హీరోను హిందూపురం నుండి మార్చి గుడవాడ నుండి పోటీకి దించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. హిందూపురం నుంచి ఇప్పటికే బాలక్రిష్ణ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. గుడివాడలో నానిని ఓడించాలంటే బాలయ్య మాత్రమే సరిపోతారనేది టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కాదని గుడివాడ నుండి పోటీకి బాలయ్య అంగీకరిస్తారా లేదా అనేది సందేహమే. జగన్ వేవ్ లోనూ హిందూపూర్ నుంచి బాలయ్య గెలుపొందారు.

ప్రత్యామ్నాయంగా మరో పేరు రెడీ

ప్రత్యామ్నాయంగా మరో పేరు రెడీ


గుడివాడలో పోటీ చేసి ఫలితం తారు మారు అయితే రాజకీయంగా బాలయ్య భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయమూ ఉంది. దీంతో..రెండో ప్రత్యామ్నాయంగా బ్రాహ్మణి పేరు ను కొంత మంది టీడీపీ పెద్దలు అధినేతకు సూచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బ్రాహ్మణి 2019 ఎన్నికల్లో లోకేష్ కు మద్దతుగా మంగళగిరి ప్రచారానికి మాత్రమే పరిమితయ్యారు. ఈ సారి ఎన్నికలు పార్టీకి జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయి. దీంతో..బ్రాహ్మణి సైతం రంగంలోకి దిగాల్సిందేనని పార్టీ నేతలు కోరుతున్నారు.

గుడివాడ లో రంజైన రాజకీయం

గుడివాడ లో రంజైన రాజకీయం

వ్యాపార రంగంలో రాణిస్తున్న బ్రాహ్మణి..ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో రావటానికి సిద్దంగా ఉన్నారా లేదా అనేది తేలాల్సిన విషయం. అయితే, దీని పైన మరింత స్పష్టత రావాల్సి ఉన్నా.. కొడాలి నాని పైన బాలయ్య ను పోటీకి దించాలనేది పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాకుండా..ముందుగానే అక్కడ పని చేసుకొనేలా రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో..ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో గుడివాడలో పోరు ఆసక్తి కరంగా మారటం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+