ఆ ఇద్దరు నేతల చుట్టూ వలపన్నిన తెలుగుదేశం, జనసేన??

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నుంచి ప్రాధాన్య‌త ల‌భించేవారిలో వారిద్ద‌రి పేర్లు మొద‌టి వ‌రుస‌లో ఉంటాయి. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన ఆ ఇద్ద‌రికీ మంత్రి ప‌ద‌వులు ల‌భించాయి. రెండున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇద్ద‌రూ మాజీల‌య్యారు. మంత్రి ప‌ద‌వుల‌ను కోల్పోయిన త‌ర్వాత ఆ ఇద్ద‌రి నేత‌ల వైఖ‌రుల్లో మార్పు వ‌చ్చింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ట్లు పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో కూడా క‌న‌ప‌డ‌టంలేదు. రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరినీ ఓడించేందుకు ఇప్పటినుంచే తెలుగుదేశం, జనసేన ఎవరికి వారు విడిగా ప్రయత్నాలు ప్రారంభించాయి.

 పోటీకి ఎవరనేది ఖారారు చేసుకున్న ప్రతిపక్షాలు

పోటీకి ఎవరనేది ఖారారు చేసుకున్న ప్రతిపక్షాలు

ఈ ఇద్ద‌రు నేత‌ల్లో ఒక‌రు ప్రభుత్వం త‌ర‌ఫున గ‌ట్టిగా వాణిని వినిపించేవారు. మ‌రొక‌రు త‌న శాఖ‌తోపాటు వివిధ శాఖ‌ల‌కు సంబంధించి విమర్శించే ప్ర‌తిప‌క్షాల‌పై నిప్పులు చెరిగేవారు. సామాజిక‌వ‌ర్గ కోటాలో మంత్రి ప‌ద‌వులు నిలుస్తాయ‌ని ఆశించిన‌ప్ప‌టికీ అవి నిల‌వ‌లేదు. దీనికితోడు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం, జ‌న‌సేన ఈసారి ఎన్నిక‌ల్లో వీరిని ఓడించ‌డానికి ఇప్ప‌టికే బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప‌లువురు నేత‌లు ప్ర‌తిప‌క్షాల‌ను క‌ల‌వ‌డం, దాదాపుగా వారికి సీట్లు ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

 ముఖ్య‌మంత్రి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే..

ముఖ్య‌మంత్రి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే..


అన్ని వైపుల నుంచి ప్ర‌తిప‌క్షాలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ముట్ట‌డించ‌డంతో ఎటువంటి రాజ‌కీయ వ్యూహం అవ‌లంబించాల‌నే సందిగ్ధంలో ప‌డిపోయారు. ఒక మాజీ మంత్రి మాత్రం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి త‌న‌కు బ‌దులుగా త‌న‌కుమారుడిని పోటీచేయించాల‌నే యోచ‌న‌లో ఉన్నారు కానీ అందుకు ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిందా? లేదా? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త రాలేదు. కానీ ఆయ‌న త‌న కుమారుడిచేత రాజ‌కీయ ఓన‌మాలు దిద్దించే ప‌నిలో ఉంటూనే ప్రతిపక్షాల కదలికలపై దృష్టిసారించారు.

సందిగ్ధంలో ప‌డ్డ మాజీ మంత్రి

సందిగ్ధంలో ప‌డ్డ మాజీ మంత్రి


మ‌రో మంత్రికి మాత్రం ప‌రిస్థితులు సానుకూలంగా క‌న‌ప‌డ‌టంలేద‌ని ఆయ‌న అనుయాయులే చెబుతున్నారు. మంత్రి ప‌ద‌విని కాపాడుకోవ‌డానికి ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఒక అగ్ర క‌థానాయ‌కుడి స‌హాయం కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ స‌మ‌యంలో స‌ద‌రు క‌థానాయ‌కుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో మాట్లాడారా? లేదా? అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు. కానీ ఈ మంత్రికి ఒక ప్ర‌తిప‌క్ష నేత నుంచి గ‌ట్టి స‌వాల్ ఎదురుకాబోతోంద‌ని తెలుస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొంద‌డం కోసం ఆ మాజీ మంత్రి విశ్వ ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంటుందంటున్నారు. మ‌రి ఈ ఇద్ద‌రు నేత‌లు ఎటువంటి వ్యూహాల‌ను అవ‌లంబించి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎదుర‌య్యే ముప్పును త‌ప్పించుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+