గుంటూరులో జనసేన క్లోజ్
ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుండగా, జగన్‌ను గద్దె దించడం కోసం టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. అయితే కూటమిలో టికెట్ల పంచాయితీ నెలకొంది. మూడు పార్టీల్లోనూ అసంతృప్తి బయటపడుతుంది. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే ఆయా పార్టీలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీల నుంచి నాయకులు భారీగా బయటకు వచ్చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల అసంతృప్తిని అధికార పార్టీ క్యాష్ చేసుకుంటుంది. దీనిలో భాగంగానే వివిధ పార్టీల్లో అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేనకు సంబంధించిన నాయకులను తమ పార్టీలో చేర్చుకుని ప్రతిపక్షాలకు గట్టి షాకిచ్చింది. ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు షేక్ జియావుర్ రెహ్మాన్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరుఫున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు కూడా భారీ సంఖ్యలో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి జనసేన రాష్ట్ర కన్వీనర్ వీరశెట్టి సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్ కో కన్వీనర్ డాక్టర్ టీవీ రావు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఇదే సమయంలో గుంటూరుకు చెందిన టీడీపీ నాయకులు కూడా భారీ సంఖ్యలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్ బైరా అజయ్‌బాబు, జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్ షాజిత్‌తోపాటు గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ తదితరులు వైసీపీలో చేరారు.












Click it and Unblock the Notifications