వైసీపీ రెబల్స్ కు చంద్రబాబు మార్క్ షాక్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించింది. టీడీపీ నుంచి 94, జనసేన 5 మంది అభ్యర్దుల జాబితా విడుదల చేసింది. పవన్ తాను పోటీ చేసే స్థానం గురించి స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ పొత్తు ఖాయమైన తరువాత మిగిలిన సీట్ల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రెబల్స్ కు సీట్ల కేటాయింపులో చంద్రబాబు తన మార్క్ షాక్ ఇచ్చారు.
సీట్ల ప్రకటన : టీడీపీ దాదాపు ఉమ్మడి 13 జిల్లాల్లోని మెజార్టీ నియోజకవర్గాల్లో సీట్లు ప్రకటించారు. పవన్ అయిదు సీట్లలో అభ్యర్దులను ఖరారు చేసారు. తన సీటు గురించి మాత్రం ప్రకటన చేయలేదు. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో జనసేన మెజార్టీ సీట్లలో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ సీట్ల ప్రకటన పైన అనంతపురం జిల్లా పెనుకొండ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆశావాహుల నుంచి ఆగ్రహం కనిపిస్తోంది. కొందరు టీడీపీకి రాజీనామా చేసారు. పవన్ పైన ఆశలు పెట్టుకున్న జనసేన నేతలు 19 తమ పార్టీ పోటీ చేసే మిగిలిన 19 స్థానాలు ఏంటనేది ఆరా తీస్తున్నారు. తమకు అవకాశం దక్కుతుందా లేదా అనే టెన్షన్ లో నేతలు ఉన్నారు.

ఎవరికి ఎక్కడ : ఇదే సమయంలో జనసేనకు కేటాయించే సీట్లలో తాము ఆశిస్తున్న సీట్ల గురించి టీడీపీ నేతలు వాకబు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు ప్రకటించాల్సి ఉంది. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నా..ఆ సీటును రెండు పార్టీలు ప్రకటించలేదు. టీడీపీలో సీనియర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ లాంటి వారికి తొలి జాబితాలో సీట్లు దక్కలేదు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రమే సీటు ఖాయమైంది. నెల్లూరు రూరల్ సీటును కోటంరెడ్డికి చంద్రబాబు తొలి జాబితాలోనే ఖరారు చేసారు. ఇదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు ఆనం, మేకపాటికి ఈ జాబితాలో స్థానం దక్కలేదు.

వారికి సీట్లు లేనట్లేనా : ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, చంద్రబాబు ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వేమిరెడ్డి టీడీపీలో చేరటం ఖాయమైతే ఆయన ఆనం ను సర్వేపల్లికి పంపాలని చేస్తున్న సూచన పరిగణలోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీటు పరిస్థితి డైలమాలో పడుతుంది. అదే విధంగా మేకపాటి చంద్రశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం ఉదయగిరిలో టీడీపీ కాకర్ల సురేష్ కు సీటు ప్రకటించింది. మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నుంచి సీటు ఖాయమని ఆశించారు. కానీ, శ్రీదేవి పేరు ప్రచారం జరిగిన తిరువూరు సీటు కొలికలపూడి శ్రీనివాస్ కు కేటాయించారు. దీంతో..ఇప్పుడు సీట్లు రాని ఈ నేతల నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications