ఒక్కసీటు మార్పుతో పొత్తు కొనసాగింపు, 3 ఎమ్మెల్సీలు

తొలుత బిజెపికి 14 అసెంబ్లీ, 4 లోకసభ స్థానాలను టిడిపి కేటాయించింది. చర్చల అనంతరం బిజెపికి 13 అసెంబ్లీ, 4 లోకసభ స్థానాలు ఖరారయ్యాయి. బిజెపికి ఇచ్చిన ఇచ్చాపురం అసెంబ్లీ సీటును ఆ పార్టీ టిడిపికి ఇచ్చేందుకు సిద్ధపడింది. అదే సమయంలో అభ్యర్థుల మార్పు అంశం కూడా కొలిక్కి వచ్చింది.
దాదాపుగా అభ్యర్థుల మార్పు ఉండకపోవచ్చు. ఉన్నా ఒకటి రెండు స్థానాల్లో బిజెపి అభ్యర్థుల మార్పు ఉండవచ్చునని చెబుతున్నారు. చంద్రబాబు నివాసంలో మూడు గంటలకు పైగా చర్చలు జరిపారు. అనంతరం వెంకయ్య నాయుడు నివాసంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్, కంభంపాటి హరిబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో టిడిపి నేతలు సుజనా చౌదరి, కె రామ్మోహన్ పాల్గొన్నారు.
మూడు ఎమ్మెల్సీలు
13 అసెంబ్లీ, నాలుగు లోకసభ స్థానాలకు పోటీ చేస్తున్న బిజెపి... తర్వాత దఫా తమకు మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలని టిడిపిని కోరింది. అందుకు టిడిపి సంసిద్ధత వ్యక్తం చేసింది.
చర్చలు విజయవంతంగా ముగిశాయని, టిడిపి-బిజెపిలు కలిసి ముందుకు వెళ్తాయని సీమాంధ్ర బిజెపి చీఫ్ హరిబాబు అన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే నామినేషన్ వేస్తారని చెప్పారు. పొత్తు కొనసాగుతుందని జవదేకర్ చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బిజెపి ఇచ్ఛాపురం టిక్కెట్ వదులుకుందని సుజనా చౌదరి చెప్పారు.
వెంకయ్యను కలిసిన పొట్లూరి
ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ శుక్రవారం బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడును కలిశారు.












Click it and Unblock the Notifications