tdp-bjp-jsp పొత్తు ఓకే.. జగన్ పై పోరులో క్షేత్రస్థాయిలో సయోధ్య సాధ్యమేనా? బిగ్ క్వశ్చన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులు ఒక కొలిచ్చి వచ్చాయి. సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చలకు తెరపడింది. టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తు ఫైనల్ అయ్యింది. సీట్ల పంపకాలపైన కూడా క్లారిటీ వచ్చింది. 17 లోక్ సభ, 144అసెంబ్లీ స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుంటే, బీజేపీకి ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలు, జనసేనకు 2 లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.

చంద్రబాబు నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బై జయంత్ పండా, కేంద్రమంత్రి గజెంద్రసింగ్ షెకావత్ 8 గంటల పాటు సుదీర్ఘ భేటీ తర్వాత పొత్తులు ఫైనల్ అయ్యాయి. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు ఓకే కానీ మూడు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో సయోధ్య కుదురుతుందా అన్నదే ఇప్పుడు అన్ని పార్టీల ముందు ఉన్న పెద్ద ప్రశ్న.

tdp-bjp-jsp alliance ok but is team work possible at field level BIG QUESTION

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీల నుండి ఆశావహులు టికెట్లు ఆశించారు. ప్రజల్లోకి వెళ్లి తమకు టికెట్ వస్తుందని, సహకరించాలని కూడా కోరారు. అయితే అనూహ్యంగా పెట్టుకున్న పొత్తులతో ఆశావహుల ఆశల మీద నీళ్ళు చల్లినట్టు అయ్యింది. దీంతో జనసేన, టీడీపీ, బీజేపీలలో చాలా మంది కీలక నాయకులు తమకు టికెట్ రాని కారణంగా తీవ్ర అసహనంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పొత్తులు పెట్టుకున్న అన్ని పార్టీలు కలిసి పని చెయ్యాల్సిన పరిస్థితి. ఎన్నికలకు ఎంతో సమయం లేని ఈ తరుణంలో మూడు పార్టీల నేతల మధ్య క్షేత్ర స్థాయిలో సయోధ్య సాధ్యమవుతుందా? వారు అందరూ కలిసికట్టుగా కూటమి గెలుపు కోసం పని చేస్తారా అంటే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

టీడీపీ, బీజేపీ, జనసేనలు ఇదే పని ఇంకా కాస్త ముందు చేసి ఉంటే నేతల మధ్య సమన్వయం కుదిర్చే అవకాశం ఉండొచ్చని, కానీ ఇప్పుడు అందుకు సమయం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాధ్యమవుతుందా అన్నది ప్రధాన ప్రశ్న అని చెప్తున్నారు.

మూడు పార్టీలు ఏకతాటిమీద క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తేనే జగన్ ను దీటుగా ఎదుర్కోగలుగుతారు. కానీ అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇక మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలో ప్రధాని మోడీతో ఏపీలో ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చెయ్యాలని కూటమి నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+