కొడాలీ.. రాజకీయ సన్యాసం ఎప్పుడు ? ఇంటిపైకి దూసుకెళ్లిన టీడీపీ.! గుడివాడలో ఉద్రిక్తత..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలకు గడ్డు పరిస్ధితులు తప్పడం లేదు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ను మెప్పించే క్రమంలో టీడీపీని దారుణంగా టార్గెట్ చేసిన నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఇవాళ గుడివాడలోని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని నివాసాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

#KodaliNani 😂.. k..chichi mingugatru chudu 😂pic.twitter.com/Icczz0AqHB
— Ꮇᴏʜᴀɴ🦁NBK✌️ (@CBNBK6) June 7, 2024
ఎన్నికలకు ముందు ఈసారి ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కొడాలి నాని సవాల్ విసిరిన నేపథ్యంలో ఇవాళ ఆయన నివాసాన్ని ముట్టడించిన టీడీపీ శ్రేణులు.. ఎప్పుడు సన్యాసం చేస్తున్నావని నినాదాలు చేశారు. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత పొట్లూరి దర్శిత్ నేతృత్వంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లను విసిరారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఉద్రికత చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా పోలీసులకూ, టీడీపీ శ్రేణులకూ మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ ఇంద్ర శ్రీనివాస్, టీడీపీ యువత నాయకుడు నిమ్మగడ్డ సత్య సాయి పరస్పరం తోసుకున్నారు. అనంతరం టీడీపీ శ్రేణులు టపాసులు కాల్చి
చంద్రబాబు జిందాబాద్ నినాదాలు చేశారు. అలాగే వైసీపీ గుర్తు ఫ్యాన్ ను నేలకేసి కొట్టి కాళ్లతో తన్నారు. జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద తెలుగు యువత టపాసులు కాల్చారు. కొడాలి డౌన్ డౌన్ నినాదాలు చేశారు. గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందన్నారు.
చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశావుగా.. ఇప్పుడు మాట నిలబెట్టుకో అని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చా దమ్ముంటే రా అని కోరారు. బొచ్చు పీకుతారా అన్నావ్ వచ్చి తమకు సమాధానం చెప్పాలన్నారు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరే అన్నారు. ఎవరొస్తారు రండి అని రెచ్చగొట్టావు, నీకు చంద్రబాబు అవసరం లేదు, తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావ్ అన్నారు.












Click it and Unblock the Notifications