టీడీపీ నేతలపై దాడికి నిరసనగా ' ఛలో తంబళ్ళపల్లె '..చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లతో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ నాయకులపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కు పిలుపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ . చలో తంబళ్లపల్లె పేరుతో ఈరోజు కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ నేతలను అనుమతి లేని కారణంగా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. కార్యక్రమానికి వెళుతున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు కరోనా దృష్ట్యా చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
తంబళ్లపల్లె నియోజకవర్గంలో 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని పోలీసులు చెప్పడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఈ రోజు టిడిపి నేతల అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిడిపి నేతల పై దాడికి నిరసనగా చలో తంబళ్లపల్లె కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంపై టిడిపి నేతల్లో అసహనం వ్యక్తం అవుతుంది. ఈ రోజు చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి వెళ్లకుండా తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఛలో తంబళ్లపల్లె కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డగింత .. నేతల హౌస్ అరెస్ట్ లు
అన్ని నియోజక వర్గాలలోనూ టిడిపి నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లెకి బయలుదేరిన నేతలను శ్రీకాళహస్తిలో అడ్డుకున్న పోలీసులు శ్రీకాళహస్తి టిడిపి కార్యాలయ ఆవరణలో వారిని అరెస్టు చేశారు .కడప జిల్లా టిడిపి నేత శ్రీనివాస్ రెడ్డిని కూడా కడప జిల్లా రామాపురం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
పలమనేరు లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ని, చిత్తూరు లో ఎమ్మెల్సీ దొరబాబు ని, పులివర్తి నాని లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

నిన్న టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసన
శాంతిపురం లో ఎమ్మెల్సీ శ్రీనివాసులు ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగడి వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు ఘటనకు నిరసనగా టిడిపి నేతలు ఈరోజు నిర్వహించాలి అనుకున్న చలో తంబళ్లపల్లె కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం పోలీసులు అడుగడుగున ప్రయత్నం చేస్తున్నారు.
నిన్న చిత్తూరు జిల్లాలో వైసీపీ దాడిలో గాయపడిన టిడిపి నేతలను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.
Recommended Video

ఆందోళనను పోలీసులు అడ్డుకోవటంపై మండిపడుతున్న టీడీపీ నేతలు
వైసీపీ దాడులకు భయపడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. నిన్న తంబళ్లపల్లె పర్యటన నిమిత్తం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెళుతున్న క్రమంలో వారి పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. టిడిపి నేతల వాహనాలను ధ్వంసం చేశారు.
ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఈ దాడిపై మండిపడుతున్నారు. తమ ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు .












Click it and Unblock the Notifications