జై జగన్ అనేసిన టీడీపీ అభ్యర్థి

ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరిట నియోజకర్గాల వారిగా ప్రచారం నిర్వహిస్తుండగా, వైసీపీ అధినేత సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట నియోజవర్గాలను చూట్టేస్తున్నారు. ఇక అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ టీడీపీ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారంలో జై చంద్రబాబుకు బదులుగా జై జగన్ అంటూ నినాదించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి పేరును చంద్రబాబు ఖారారు చేశారు. దీంతో ఆమె నియోజకవర్గంలో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ... స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ షోలో భాగంగా టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Tdp candidate jai jagan slogans at election campaign

అయితే తన ప్రసంగం చివర్లో జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. గౌరు చరిత జై జగన్ అనడంతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. వెంటనే తన పొరపాటును గుర్తించిన గౌరు చరితారెడ్డి జై చంద్రబాబు అంటూ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గౌరు చరితారెడ్డి మొదట్లో వైసీపీలోనే కొనసాగారు.

మనిషి టీడీపీలో ఉన్న ఆమె మనస్సు వైసీపీతోనే ఉందని ఆ పార్టీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ నుంచి గౌరు చరిత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఆమెకు జగన్ సీటును నిరాకరించారు. గౌరు చరితారెడ్డికి బదులు కాటసాని రాంభూపాల్‌రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతిలో గౌరు చరిత ఓడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+