కేసీఆర్ ఓటమికి కారణమిదే, అదే జగన్ భయం - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

దాదాపు మూడు నెలల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. వరదలతో దెబ్బ తిన్ని ప్రాంతాలను సందర్శించారు. రైతులకు భరోసా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల పైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అహంకారం తో విర్రవీగితే ఏమవుతుందో తెలంగాణలో చూసామని వ్యాఖ్యానించారు. తన అరెస్ట్ తో జగన్ లో భయం మొదలైందని చెప్పుకొచ్చారు.

అహంకారంతోనే ఓటమి : తెలంగాణ ఎన్నికల పైన చంద్రబాబు తొలి సారి స్పందించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినా..ఇప్పటి వరకు ఎక్కడా చంద్రబాబు తన అభిప్రాయం వెల్లడించలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినా హాజరు కాలేదు. ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు హాజరు కాకపోవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, తొలిసారి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన స్పందించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారం ఉంటే ఏమౌతుందనేది తెలంగాణలో చూశామన్నారు. మరో మూడు నెలల తర్వాత ఏపీలో తెలంగాణ పరిస్థితే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

TDP Cheif Chandra Babu reacts on Telangana Results, says same will repeat in AP

రైతులకు పరామర్శ : తెనాలి నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాలు..వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు. పొలాల్లోకి దిగి నీట మునిగిన చేనును స్వయంగా పరిశీలించారు. తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మానవ తప్పిదం వల్లే రైతులు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే, తనలాంటి వాళ్లని కూడా జైల్లో పెడతారన్నారు. చేయని తప్పుకు ఎంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. ముందస్తు చర్యలతో నష్ట నివారణ చర్యలకు అన్ని అవకాశాలు ఉన్నా, ప్రభుత్వం సకాలంలో స్పoదించలేదపి మండిపడ్డారు. కౌలు రైతుల్ని చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుంటే, నష్టపోయిన ప్రతీ రైతుని 3 నెలల తర్వాత తానే ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

జగన్ లో భయం మొదలైంది : కౌలు రైతుల్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. కరువు వల్ల సగం మంది పంట వేయలేదన్నారు. పంట వేసిన వారంతా తుపాను వల్ల నష్టపోయారని తెలిపారు. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల పాలైంది ఏపీలోనే అని చెప్పుకొచ్చారు. పట్టిసీమ నీరు ముందుగా వదిలి ఉంటే ఈపాటికి రైతులు పంటల్ని కాపాడుకుని ఉండేవారన్నారు. తన షెడ్యూల్ ఖరారవుతే కానీ ముఖ్యమంత్రి లో కదలిక లేదన్నారు. వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు పైనే నష్టం వాటిల్లిందన్నారు. 2011 లోనే నష్టపరిహారం కింద రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.10,000 ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.30,000 ఇస్తే గానీ రైతులకు గిట్టుబాటు కాదన్నారు. తన లాంటి వ్యక్తిని జైల్లో పెట్టిన జగన్ భయపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+