చంద్రబాబుకు వైజాగ్ షాక్, ఇంజనీరింగ్ లో బైపీసీ - వైరల్, ట్రోలింగ్..!! (వీడియో)

టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు చంద్రబాబు కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు. విశాఖలో చంద్రబాబు విజన్ 2047 విడుదలకు టీడీపీ శ్రేణులు భారీ ప్రచారం చేసారు. విశాఖ నగరంలో చంద్రబాబు బీచ్ రోడ్ లో సద్భావనా పాదయాత్ర నిర్వహించారు. తరువాత జరిగిన నిర్వహించిన సభకు జన స్పందన లేదు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు చేసిన కామెంట్స్..ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశాఖలో ఊహించని విధంగా: ఏపీలో మూడు రాజధానుల వివాదం వేళ విశాఖ కేంద్రం రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ దసరా నుంచి విశాఖలో వారంలో మూడు రోజులు ఉంటూ పాలన అక్కడి నుంచే కొనసాగేలా దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర విశాఖలో కొనసాగిస్తున్నారు.

TDP Chief Chandra Babu Comments on BiPC In Engineering goes Viral, Netizens Trolling

సీఎం జగన్ లక్ష్యంగా పవన్ యాత్ర..సభలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవం నాడు విశాఖలో వినూత్నంగా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం పార్టీ శ్రేణులు ఆరీ ఏర్పాట్లు చేసారు. విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేసారు. అయిదేళ్ల తప్పు రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని వ్యాఖ్యానించారు.

బైపీసీ చేస్తే ఇంజనీరింగ్: ఇదే సమయంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ను నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు తన విజన్ ఆవిష్కరణలో భాగంగా ఇంటర్ లో ఇంజనీర్ కావాలంటే బీపీసీ చేయాలంటూ చెప్పుకొచ్చారు. ఆ కామెంట్స్ ను వైసీపీ కేడర్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నాడు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ అంటూ చేసిన వీడియోను ప్రస్తుతం చంద్రబాబు వీడియోతో కలిపి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఇదేనా విజన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక, విజన్ డాక్యుమెంట్ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం కనిపించ లేదు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. భారీగా కనిపిస్తున్న ఖాళీ కుర్చీలు..అటు కొనసాగుతున్న చంద్రబాబు ప్రసంగాన్ని సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.

విశాఖ సభకు కరువైన స్పందన: ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ లో ఆగస్టు 15 నాడు చంద్రబాబు సభకు కనీస స్పందన లేకపోవటం టీడీపీ నేతలకు అంతు చిక్కటం లేదు. పార్టీ మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన లేదు. అదిరిపోయే సంక్షేమం అందిస్తామని చెబుతున్నా..ఆదరణ కనిపించలేదని పార్టీలో చర్చ సాగుతోంది.

ఇదే సమయంలో తన విజన్ అంటూ ఎన్నికల వేళ ప్రజల ముందుకు వచ్చేందుకు చంద్రబాబు విశాఖను వేదికగా మలచుకొనే ప్రయత్నం చేసారు. కానీ, ఊహించని విధంగా సభకు కనీస స్పందన కనిపించలేదనేది వైరల్ అవుతున్న వీడియోల ద్వారా స్పష్టం అవుతోంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+