చంద్రబాబు ఫైర్: వరదలొస్తే జగన్ విదేశీ పర్యటనా :నన్ను టార్గెట్ చేయటమే వైసీపీ లక్ష్యం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ ఫైర్ అయ్యారు. వరద నియంత్రణ వదిలేసి తనను..తన చుట్టూ మంత్రులు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కృష్ణాకు వరదలొస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా వెళ్లారని విమర్శించారు. విపత్తులు సంభవించినప్పుడు గతంలో టీడీపీ ఇలాగే చేసిందా అని ప్రశ్నించారు. ఈ మేన్‌ మేడ్‌ డిజాస్టర్‌కు బాధ్యత వైసీపీదేనని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చిన నీళ్లను నిల్వచేసే ఆలోచనలేదు. చెరువులు నింపడం పై దృష్టిలేదు. తప్పుడు పనులు చేయడమే వైసీపీ లక్ష్యం అంటూ ఆరోపించారు.

వరదల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం..
వరద లతో ప్రజలకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వరద నియంత్రణ వదిలేసి తన చుట్టూ..తన నివాసం చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. తన నివాసాన్ని టార్గెట్‌చేయడమే వైసీపీ లక్ష్యమని ఆయన పదేళ్ల తర్వాత కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తిందని... మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణను దాటి ఏపీకి వరద ఉధృతి పాకిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

TDP Chief Chandra babu serious on Govt negligency in flood resque operations.

కానీ వరద నిర్వహణలో వైసీపీ నేతలు పూర్తిగా విఫలం అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరద తీవ్రత అంచనాలోనూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టమైందన్నారు. ఎక్కెడెక్కడ ఎంత వరద వస్తుంది...ఎంత వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంలో స్పష్టమైన నిర్ధేశం ఉన్నా వైసీపీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం , సాగర్‌, పులిచింతల రిజర్వాయర్లన్నీ మొన్నటి దాకా ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడెంత వరద వస్తే, ఎంత నీటిని వదలాలి అన్నవిషయంపై స్పష్టత ఉన్నా వీటన్నింటినీ వైసీపీ నేతలు గాలికొదిలేశారని దుయ్యబట్టారు.

నాపై కక్ష్యతో ఏపీకి నష్టం చేసారు..
తన పైన కక్ష్య సాధింపుతోనే రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. వైసీపీ తన పై కక్షసాధింపు చర్యలకుపాల్పడుతూ ప్రజల్ని వరదల్లో ముంచేసిందని ఆరోపించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం తొలిరోజు నుంచీ వైఫల్యంచెందిందని అన్నారు. దీనిని మనిషి చేసిన విపత్తుగానే చూడాలని చంద్రబాబు అన్నారు. ఈ మేన్‌ మేడ్‌ డిజాస్టర్‌కు బాధ్యత వైసీపీదేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని కూడా మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారన్నారు. వచ్చిన నీళ్లను నిల్వచేసే ఆలోచనలేదు.

చెరువులు నింపడం పై దృష్టిలేదు. తప్పుడు పనులు చేయడమే వైసీపీ లక్ష్యం. మాజీ సీఎం ఇంట్లోకి నీళ్లు వచ్చాయని చూపడం కోసం లక్షలాది కుటుంబాలతో ఆడుకున్నారు. అందరి ఇళ్లు ముంచాలని చూశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణాకు వరదలొస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా వెళ్లారు...పరిపాలనపై వీళ్లకు సీరియస్‌నెస్‌ లేదన్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో ఏపీని నాశనం చేస్తున్నారని చంద్ర బాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే జపాన్‌, ఫ్రాన్స్‌ హెచ్చరించాయి. ప్రపంచ దేశాల్లో అనేకం ఏపీకి దూరమయ్యాయి. విపత్తులు సంభవించినప్పుడు గతంలో టీడీపీ ఇలాగే చేసిందా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+