చేతికి మట్టి అంటకుండా... అదీ చంద్రబాబంటే!

రాజకీయాల్లో తలపండిన చంద్రబాబునాయుడి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, నిర్ణయాలు, ఎత్తుగడలు ఎలా ఉంటాయా? అని అన్ని పార్టీల నేతలు ఆసక్తితో గమనిస్తుంటారు. ఎందుకంటే ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అనేక అర్థాలు, కారణాలు ఇమిడివుంటాయి. బీజేపీ, జనసేనతో పొత్తులో భాగంగా కూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబు దాదాపుగా పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒకటీ అరా నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి. వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తున్న బాబుకు పార్టీలోని కొందరు నాయకులు కంట్లో నలుసుగా మారారు.

దీంతో కర్ర విరగకుండా.. పాము చావకుండా.. అన్న రీతిలో తన చేతికి మట్టి అంటకుండా వారిని పక్కన పెడుతున్న తీరు మాత్రం అందరిచేత ఔరా అనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం సీటును ముందుగా మహాసేన రాజేష్ కు ప్రకటించారు. వాగ్ధాటి, వైసీపీపై విమర్శలు, ఏ సబ్జెక్టుపైనైనా అనర్గళంగా మాట్లాడటంలాంటివి కలిసివచ్చాయి. అయితే రాజేష్ కు సీటు విషయమై స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ ఓటమిపాలైనా తమకు ఇబ్బంది లేదని రాజేష్ మాత్రం వద్దని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. కొద్దిరోజుల సమయం గడిచిన తర్వాత మరోసారి వారికి చంద్రబాబు రోజుల తరబడి నచ్చచెప్పినప్పటికీ వారు వినలేదు. దీంతో ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారికి సీటు కట్టబెట్టింది.

tdp chief chandrababu different strategy for critical constituencies

అవనిగడ్డకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్ తనకు సీటు కావాలంటూ పట్టుబట్టారు. 2014 ఎన్నికల్లోనే ఆయన కష్టంగా గట్టెక్కారు. ఈసారి సీటిస్తే ఓటమి తథ్యమని సర్వేలు చెప్పాయి. అయినప్పటికీ బుద్ధప్రసాద్ తనకు సీటు కావాలన్నారు. కాపులను ప్రభావితం చేసేలా మాట్లాడారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని కూడా జనసేనకు ఇచ్చేశారు. ఇక్కడనుంచి పోటీకిదిగే నాయకుల వేటలో జనసేన ఉంది. దీనివల్ల మండలి బుద్ధప్రసాదే నష్టపోయారు.

అలాగే ధర్మవరం నియోజకవర్గం నుంచి యువ నాయకుడు పరిటాల శ్రీరాం కూడా తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఆయనైతే కష్టమని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ పరిటాల మాట వినకపోవడంతో ఆయన్ని పిలిచి సర్వే రిపోర్టులు ఎదుటపెట్టి పరిస్థితిని చంద్రబాబు వివరించారు. అయినా శ్రీరాం వినడంలేదు. దీంతో ఈ నియోజకవర్గాన్ని చడీచప్పుడు లేకుండా బీజేపీకి కేటాయించేశారు. ఇలాంటి నియోజకవర్గాలు చాలావున్నప్పటికీ నాయకులు సహకరించడంలేదు. దీంతో వీరిని బయటకు పంపించలేక ఇతర పార్టీలకే చంద్రబాబు కేటాయించేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+