ముస్లింలకు చంద్రబాబు కీలక పిలుపు-బీజేపీతో పొత్తు వేళ..!

ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లింలలో భయాందోళనలు రేకెత్తించేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోందని విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. బీజేపీతో పొత్తుపై వైసీపీ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఇవాళ పలువురు ముస్లిం సంఘాల నేతలు చంద్రబాబును కలిసి ఈ మేరకు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మతపరమైన అంశాల్లో ఇబ్బందులు ఉండబోవన్నారు.

సీఎం జగన్ మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కోడికత్తి డ్రామా నుండి బాబాయ్ హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్ .. ఇప్పుడు మతాలు, కులాలపై పడ్డారని విమర్శించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీతో పాటు పలువురు ముస్లిం సంఘాల నేతలు ఇవాళ చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరడంపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.

tdp chief chandrababu key call to muslims amid alliance with bjp

జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయం చేసి బోల్తాపడ్డ జగన్ అండ్ టీం... ఇప్పుడు బీజేపీతో పొత్తు అనంతరం మత రాజకీయానికి తెరతీసిందని చంద్రబాబు వారితో అన్నారు. టీడీపీ బీజేపీ పొత్తుతో ముస్లీం మైనారిటీలకు నష్టం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలను నమ్మరన్నారు. ముస్లిం సంఘాల నేతలు కూడా వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ముస్లింలపై జగన్ కు నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ మాసంలో ఇచ్చే రంజాన్ తోఫా కూడా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.

ముస్లింలకు ఇచ్చే దల్హన్ పథకం, దుకాన్ మకాన్ సహా పది సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్...ఎన్నికలు రాగానే మత రాజకీయంతో లబ్ధి పొందాలని చూస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు ఒక్క పథకం అయినా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కడపలో 90 శాతం పూర్తి చేసిన హజ్ హౌస్ ను కూడా పూర్తి చెయ్యలేకపోయిన జగన్ కు మైనారిటీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ముస్లింల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్లో రాజీ ఉండదని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు.

త్వరలో ముస్లిం డిక్లరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు పూర్తి భరోసా కల్పిస్తామని, అలాగే బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలవటం జరిగింది కాబట్టి ముస్లిం సమాజం దూర దృష్టితో మమ్మల్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బాసటగా ఉండాలి కోరారు. గతంలోనూ టీడీపీ బీజేపీతో కలిసినా ముస్లింల ఆర్ిధక, సామాజిక, విద్య, రాజకీయ అంశాల్లో పూర్తిగా టీడీపీ ముస్లిం సమాజానికి వెన్ను దన్నుగా నిలిచిందన్నారు. మతపరమైన అంశాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదన్న అంశం గుర్తించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+