ఏపీలో ఆలస్యంగా ఎన్నికల వెనక చంద్రబాబు?

ఏపీకి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 18న నోటిఫికేషన్ విడుదలవగా ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. మే 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి ఎన్నికల్లో మొదటి విడతలోనే ఎన్నికల క్రతువును పూర్తిచేశారు. చంద్రబాబునాయుడు ఎన్డీయేతో విభేదించి బయటకు రావడం.. తదనంతర పరిణామాలు వైఎస్ జగన్ కు ఎన్నికల్లో సహకారం అందేలా మారాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ఈసారి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నాలుగో విడత ఏపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదలవుతున్నాయి.

గతంలో తనకు ఎదురైన పరిణామాలను చంద్రబాబు గుణపాఠాలుగా మార్చుకున్నారు. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. దీనిలో భాగంగానే నాలుగో విడత ఎన్నికలు జరిగేలా ఎన్డీయే పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఏపీ ఎన్నికలను నాలుగో విడతలో నిర్వహించడం వెనక చంద్రబాబు ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటవడం వెనక 31 అసెంబ్లీ, ' లోక్ సభ నియోజకవర్గాలను వదులుకోవాల్సి వచ్చింది.

tdp chief chandrababu naidu behind the ap election delay

నియోజకవర్గాలవారీగా ఉన్న అసంతృప్తులను బుజ్జగించడానికి, పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో జగన్ కు ఏవిధంగా అయితే ఎన్నికల సహకారం అందిందో ఈసారి అలాగే టీడీపీకి అందేలా చంద్రబాబు జాగ్రత్తగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి తెచ్చి నాలుగో విడతలో ఎన్నికలు పెట్టించారంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబువల్లే ఆలస్యం అంటూ ప్రచారం చేస్తూ వైసీపీ నాయకుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంవల్ల అభ్యర్థుల ఖర్చు పెరుగుతుందని, దీన్ని భరించాలంటే కష్టమంటూ అన్ని పార్టీల నేతలు వాపోతున్నారు. నాలుగో విడత ఎన్నికలు ఏ పార్టీకి కలిసిరానున్నాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేవరకు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+