ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరు; అంతిమంగా విజయం ప్రజలదే: రాజధానిపై చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 700 రోజులకు చేరుకుంది. రాజధాని ప్రాంత రైతులు తమ ఆకాంక్షను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 700 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతుల ఉద్యమాన్ని ఎంతగా అణచివేయాలని ప్రయత్నించినప్పటికీ అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

రాజధాని రైతుల పోరాటానికి టీడీపీ మద్దతు
తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అమరావతి రైతుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది .టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి రైతులకు తమ మద్దతును ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి నగరాన్ని కొనసాగించే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఇక తాజాగా రాజధాని అమరావతి రైతుల ఉద్యమం 700 రోజుకు చేరుకోవడంతో చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల ఉద్యమాన్ని మహోద్యమంగా అభివర్ణించారు. అంతిమ విజయం ఎప్పటికైనా ప్రజలదే నంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజధాని అమరావతి ఉద్యమంపై చంద్రబాబు
ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన మహోద్యమం 700 రోజులకు చేరుకుందని పేర్కొన్న టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర కూడా 16వ రోజుకు చేరుకుంది.అమరావతి ఉద్యమంలో అమరులైన 189 రైతులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఆయన రాజధాని అమరావతి కోసం 189 మంది రైతులు అమరులయ్యారు అని, వారిని గుర్తు చేసుకుని, వారికి నివాళులర్పించారు.

రాజధాని అమరావతి కోసం పోరాటం ఒకవైపు.. మూడు రాజధానుల ఏర్పాటు అంటూ మరోవైపు
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు జరిగి తీరుతుందని వైసీపీ మంత్రులు తేల్చి చెబుతున్నారు .సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందని న్యాయ సమస్యలు పరిష్కారమైతే రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుందని వారు పేర్కొన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు జరుగుతుందో లేదో మీరే చూస్తారు అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారంటూ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో మంగళవారం రాజధాని అమరావతి పై ఏపీ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల రాజధాని కాదని, ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని అని ఆయన స్పష్టం చేశారు.

Click it and Unblock the Notifications