చంద్రబాబు అదిరిపోయే వ్యూహం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయాలతో చంద్రబాబు మంచి జోష్ లో ఉన్నారు. ఎక్కడ పర్యటించడానికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వస్తుండటం కూడా ఆయనలో ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమైంది. ఈ క్రమంలోనే బలహీనంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఒక వ్యూహాన్ని రూపొందించారు. బలహీనంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోను స్వయంగా తానే పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన పెట్టుకున్నారు. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం స్థానాల్లో పర్యటించబోతున్నారు. తాను స్వయంగా పర్యటించడంవల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో చురుకు వస్తుందని, తన పర్యటన జోష్ ను నింపితే ఎన్నికల వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తారని బాబు భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన తర్వాత ప్రకాశం జిల్లాపై బాబు దృష్టిసారించారు. ఈనెల 19, 20, 21 తేదీల్లో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, భారీ బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో గత కొద్ది ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులే విజయాలు సాధిస్తున్నారు. ఈసారి ఆ పరిస్థితిని మార్చాలనే పట్టుదలను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా నియోజకవర్గాలను గుర్తించి రోడ్ షోలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ ఆధిపత్యాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. రాయలసీమ నుంచే టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని, దీనివల్ల అధికారం సులువుగా చేజిక్కితుందనే ఉద్దేశంతో చంద్రబాబు తన ప్రణాళికను అమలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications