ఉద్యోగులకు లేఖలు: భారతిపై టిడిపి ఫిర్యాదు, సాక్షిపైనా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి తమ మీడియా సంస్థలలో పని చేసే ఉద్యోగులకు తమ పార్టీకి ఓటు వేయాలని చెప్పారని, ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తూ టిడిపి ఈసికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు లేఖ రాసినందుకు చర్యలు తీసుకోవాలని టిడిపి ప్రధాన కార్యదర్శి ఎంఎ షరీఫ్ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధానాధికారికి లేఖ రాశారు.
పార్టీ అబ్యర్థుల కోసం ప్రచారం చేయాలని కూడా వైయస్ భారతి తన లేఖలో ఉద్యోగులకు సూచించారని, తద్వారా కోడ్ ఉల్లంఘించారని, ఐడియా సర్వీస్ ప్రొవైడర్ నుండి ఈ సందేశాలు వెళుతుననాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పార్టీ అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, మద్యం పంచుతున్నారని పేర్కొన్నారు.

అలాగే, సాక్షి, ఎన్టీవి ఛానళ్లలో వచ్చే ప్రకటనల పైన చర్యలు తీసుకోవాలని టిడిపి ఫిర్యాదు చేసింది. ఎన్టీవి, సాక్షి, వి గార్డ్, బజాజ్ కంపెనీలు ఎన్నికల నియమావళి అతిక్రమిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.
వి గార్డ్, బజాజ్ సంస్థలు వ్యాపార ప్రకటనల రూపంలో వైయస్సార్ కాంగ్రెసు ఎన్నికల గుర్తు ఆయిన ఫ్యాన్‌కు పరోక్షంగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వి గార్డ్‌కు రాష్ట్రంలో ఫ్యాన్ల అమ్మకాలు లేనేలేవని చెప్పారు. ఈ సంస్థల ప్రకటనలను ప్రసారం చేస్తున్న సాక్షి, ఎన్టీవిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications