రోజా పై టిడిపి అభ్య‌ర్ది ఎవ‌రు : అసెంబ్లీలో కాలు పెట్ట‌కూడ‌దు : చ‌ంద్ర‌బాబు నిర్ణ‌యం..!

వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ను ఈ సారి ఎలాగైనా ఓడించాలి. ఇది టిడిపి ల‌క్ష్యం. పార్టీ కంటే అధినేత చంద్రబాబు.. లోకే ష్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీని కోసం ఇప్ప‌టి వ‌ర‌కు టిడిపి అధిష్టానం అనేక పేర్ల‌ను ప‌రిశీలించింది. సినీ రంగంలో పేరున్న న‌టీమ‌ణుల‌ను తెర మీద‌కు తెచ్చారు. అయితే, ఇప్పుడు చిత్తూరు లోక్‌స‌భ ప‌రిధిలో అభ్య‌ర్దుల ఖ‌రారు స‌మ యంలో మాత్రం కొత్త పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి...

రోజా పై టిడిడి నుండి..

రోజా పై టిడిడి నుండి..

గ‌త ఎన్నిక‌ల్లో సినీ న‌టి రోజా న‌గ‌రి నుండి గెలుపొందారు. టిడిపి సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు పై గెలి చి అసెంబ్లీలో కాలు పెట్టారు. అప్ప‌టి నుండి టిడిపి అధినేత..ముఖ్య‌మంత్రి చంద్రబాబు పైనా..లోకేష్ పైనా అనేక సార్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. అసెంబ్లీలోనూ కాల్ మ‌నీ వ్య‌వ‌హారంలో ముఖ్య‌మంత్రి పై అనుచిత వ్యాఖ్మ‌లు చేసారు . ఫ‌లితంగా శాస‌న‌స‌భ నుండి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. దీని పై న్యాయ పోరాటం చేసారు. ఆనాటి నుండి నేటి వ‌ర‌కు తిరిగి ఏపి అసెంబ్లీలో కాలు పెట్ట లేక పోయారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో త‌మ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్న రోజా తిరిగి అసెంబ్లీకి రానీయకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాను ఓడించేందుకు చాలా కాలంగా టిడిపి దృష్టి సారించింది.

రోజా ను ఢీకొడ‌తామంటూ..

రోజా ను ఢీకొడ‌తామంటూ..

వైసిపి ఎమ్మెల్యే రోజా పై టిడిపి నుండి తొలుత వెట‌ర‌న్ హీరోయిన్ వాణీ విశ్వ‌నాద్ పేరు తెర మీద‌కు వ‌చ్చింది. ఆమో అమ‌రావ‌తికి వ‌చ్చి ముఖ్య‌మంత్రితోనూ స‌మావేశం అయ్యారు. రోజా పై విమ‌ర్శ‌లు చేసారు. టిడిపి కోరితే తాను పోటీకి సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత కొద్ది రోజుల‌కే ఆమె రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఇక‌, మరో హీరోయిన్ దివ్య వాణి టిడిపి లో ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌తిప‌క్షం పై ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో అధినేత దృష్టిని ఆక‌ర్షించారు. ఢిల్లీలో ముఖ్య మంత్రి దీక్ష వేదిక పై నుండి ప్ర‌ధాని మోదీ..వైసిపి అధినేత జ‌గ‌న్ ల‌క్ష్యంగా అనేక విమ‌ర్శ‌లు చేఉసారు. దీంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుండి రోజా పై టిడిపి అభ్య‌ర్ది దివ్య వాణీ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు టిడిపి లో సీన్ మారిపోయింది. న‌గ‌రి అభ్య‌ర్ధిత్వం పై ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు.

న‌గ‌రి నుండి రేసులో ఇద్దరు

న‌గ‌రి నుండి రేసులో ఇద్దరు

టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు లోక్‌స‌భ ప‌రిధిలో అసెంబ్లీ స్థానాల అభ్య‌ర్దుల ఎంపిక పై క‌స‌ర‌త్తు చేసారు. న‌గ‌రి స్థానం నుండి స్ప‌ష్ట‌త రాలేదు. నగరి సీటును గాలి ముద్దుకృష్ణమ నాయుడు పెద్ద కుమారుడు భానుప్రకాష్‌ ఆశిస్తుండ గా అతనికి కుటుంబసభ్యులే వ్యతిరేకంగా వున్నారు. ముద్దుకృష్ణమ సతీమణి, ఎమ్మెల్సీ సరస్వతమ్మ, చిన్న కుమారు డు జగదీష్‌ సహా నియోజకవర్గంలోని ముఖ్యనేతలంతా సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీల ఛైర్మన్‌ కొండూరు అశోక్‌రాజుకు మద్దతుగా నిలిచారు. ఇరువర్గాలూ పోటాపోటీగా బస్సులు ఏర్పాటు చేసి అనుచరులను ఉండవల్లికి తరలించారు. అక్కడ పరిశీలకులతో మాట్లాడే సమయంలో ఇరువర్గాలూ నినాదాలు చేసుకుంటూ గొడవపడ్డారు. పరస్పరం నెట్టుకు నే దాకా పరిస్థితి దారితీసింది. ఇక్కడ మాత్రం ముద్దుకృష్ణమ కుటుంబీకుల్లో ఒకరికి లేదా అశోక్‌రాజుకు టికెట్‌ కేటా యించే పరిస్థితి వుంది. ముఖ్య‌మంత్రి వీరిలో ఒక‌రిని ఖ‌రారు చేస్తారా..లేక కొత్త వారిని తెర మీద‌కు తెస్తారా అనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+