టీడిపి కాంగ్రెస్ పొత్తు..! సై అంటున్న ఏపి మంత్రులు..! సంయ‌మ‌నం పాటించాలంటున్న బాబు..!!

Recommended Video

    ఏపీలో పొత్తుల పై జిత్తులు..!

    ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు పొత్తుల అంశంతో ఉడికి పోతోంది. ఏ పార్టీ మ‌రే ఇత‌ర పార్టీతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నిక‌ల్లో పాల్గొంటుంది అనే అంశంపై తారా స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా ఏపిలో తెలుగుదేశం పార్టీ బ‌లంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికి ఏదోఒక పార్టీతో పొత్తుపెట్టెకుని ఎన్న‌క‌ల‌ను ఎదుర్కోవ‌డం చంద్ర‌బాబు విధానం కాబ‌ట్టి ఏపీలో తెలుగుదేశం పార్టీ పొత్తు అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌ధాన ఆక‌ర్శ‌ణ‌గా మారింది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల క‌న్నా రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని చెప్పుకొచ్చే చంద్ర‌బాబు పొత్తు అంశంలో ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ పార్టీతో క‌లిసి ముందుకు వెళ్తే ప్ర‌జ‌ల‌కు ఆమోద‌యోగ్యంగా ఉంటుందో, పొత్తు అంశం పై ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు చంద్ర‌బాబు.

     ఏపీలో పొత్తుల పై జిత్తులు..! నిధాన‌మే ప్ర‌ధానం అంటున్న చంద్ర‌బాబు..!!

    ఏపీలో పొత్తుల పై జిత్తులు..! నిధాన‌మే ప్ర‌ధానం అంటున్న చంద్ర‌బాబు..!!

    ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఎప్పుడెలా మారుతుందో ఊహించడం కష్టంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి విజయాన్ని కట్టబెట్టారు అక్కడి ప్రజలు. ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలతో వచ్చే ఎన్నికలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ ఇప్పుడు విడిపోవడం, వైసీపీ కూడా రేసులో ఉండడం, జనసేన కూడా ఈ సారి అన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండడం, కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలపై దృష్టి పెట్టడం.. వంటి కారణాలతో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. అయితే, అన్ని పార్టీల కంటే ఈ సారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఓ అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది.

     పొత్తు తో ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కూడ‌దు..! ప్ర‌జ‌ల‌ను ఒప్పించ గ‌లిగితేనే పొత్తు..!

    పొత్తు తో ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కూడ‌దు..! ప్ర‌జ‌ల‌ను ఒప్పించ గ‌లిగితేనే పొత్తు..!

    విభజన హామీల విషయంలో ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత టీడీపీ కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేసింది. అంతేకాదు, కేంద్రంపై పెట్టిన అవిశ్వాసంతో టీడీపీ-బీజేపీ మధ్య దూరం బాగా పెరిగిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా బీజేపీకి మద్దతు ఇవ్వదనేది అందరికీ తెలిసిన విషయమే. దీనిని ఆసరాగా భావించిన కాంగ్రెస్ ఇటీవల జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తీర్మానించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీకి, కాంగ్రెస్‌కు మధ్య సంబంధం బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    కాంగ్రెస్ తో పొత్తుకు అంతా సానుకూలం..! ప్ర‌జ‌ల అభిమంతం ముఖ్యం అంటున్న బాబు..!!

    కాంగ్రెస్ తో పొత్తుకు అంతా సానుకూలం..! ప్ర‌జ‌ల అభిమంతం ముఖ్యం అంటున్న బాబు..!!

    ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై తెలుగుదేశం పార్టీలో చర్చలు జరుగుతున్నాయట.
    వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్త పెట్టుకుందామని ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు ఇటీవల చంద్రబాబు వద్ద ప్రస్తావించారని, దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి చంద్రబాబు ఆ నేతలకు వివరణ కూడా ఇచ్చారని తెలిసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు సానుకూలత ఉంది. అలాగే టీడీపీకి నేతలు దూరమైనా కేడర్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ రెండు పార్టీల ప్రధాన టార్గెట్ టీఆర్ఎస్ కాబట్టి అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.

    రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు వ‌ద్దు.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముద్దు..!

    రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు వ‌ద్దు.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముద్దు..!

    కానీ రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్‌పై ఇప్పటికీ ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఏపీలో పొత్తు పెట్టుకుంటే తాము నష్టపోయే అవకాశం ఉందని చంద్రబాబు సదరు నేతలతో అన్నారని సమాచారం. ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని, మరో రాష్ట్రంలో పెట్టుకోకపోతే జనం విశ్వసించరు కాబట్టి ఆ పార్టీతో పొత్తుపై ఇప్పుడే కంగారు పడొద్దనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఐతే విభ‌జన‌తో గాయ‌ప‌డ్డ ఏపి ప్ర‌జ‌ల మ‌నో భావాల‌ను అదే విభ‌జ‌న హామీల అమలుతో సరిదిద్దాల‌ని కాంగ్రెస్ పార్టీ క్రుతనిశ్చ‌యంతో ఉన్న‌ట్టు నిరూప‌ణ జ‌రిగింది. ఈ ఒక్క ప‌రిణామంతో చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు మొద‌టి నుంచి చెప్తున్న‌ట్టు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల క‌న్నా రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మైతే కాంగ్రెస్ తో ముందుకు వెళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. సో ఎన్నికల స‌మ‌యానికి ఈ రెండు పార్టీల పొత్తుపై స్పష్టత వచ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+