• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహానాడులో వైసీపీ టార్గెట్‌గా చంద్రబాబు ఫైర్‌- స్టేట్‌ టెర్రరిజం- జగన్‌కు హితవు

|

టీడీపీ ఏటా జరుపుకునే మహానాడు డిజిటల్‌గా ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహిస్తున్న మహానాడులో అధినేత చంద్రబాబుతో పాటు సీనియర్‌ నేతలంతా జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొంటున్నారు. ఆరంభ ఉపన్యాయం చేసిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. టీడీపీ క్యాడర్‌ ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పాలన ఎంతోకాలం సాగదంటూ, పద్ధతి మార్చుకోవాలంటూ జగన్‌కు చంద్రబాబు హితవు పలికారు.

 మహానాడు తెలుగు జాతి పండుగ

మహానాడు తెలుగు జాతి పండుగ

టీడీపీ డిజిటల్ మహానాడు తొలిరోజు పార్టీ అధినేత చంద్రబాబు వర్చువల్‌గా ప్రసంగించారు. కొన్ని మతాలు, కులాలు, రాష్ట్రాలకు పండుగలుంటాయని, కానీ ప్రపంచంలోనే తెలుగు జాతి పండుగ టీడీపీ మహానాడు అని చంద్రబాబు అన్నారు. ఓ యుగపురుషుడు ఎన్టీఆర్‌ పుట్టినరోజు అని, ఇది అన్ని పండుగల కంటే భిన్నమైనది, పవిత్రమైన పండుగ అని ఆయన పేర్కొన్నారు. తెలుగుజాతి ఒకప్పుడు పెను సంక్షోభంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ తెలుగుదేశం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి అంటే ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గుర్తుకొస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తెలుగువారు కనిపిస్తున్నారంటే అది టీడీపీ వల్లేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశాం, విపక్షంలోఉన్నప్పుడు కూడా సమస్యలపై ప్రజల్నిచైతన్యవంతం చేయాలని క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు.

 టీడీపీ అంటే ఎందుకంత భయం ?

టీడీపీ అంటే ఎందుకంత భయం ?

కోవిడ్ నేపథ్యంలో కుప్పం, టెక్కలి, రేపల్లె, పాలకొల్లులో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టామని, ఆన్‌లైన్ టెలీ మెడిసిన్‌ అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 650 మందికి ఇప్పటివరకూ సాయం చేశామని, మందులు, తిండి కూడా అందిస్తున్నామన్నారు. కోవిడ్‌ ఆస్పత్రుల్ని సందర్శిస్తాంటే తమ నేతల్ని అడ్డుకున్నారని, ఎందుకంత భయమని చంద్రబాబు ప్రశ్నించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కాదని ఆనందయ్యతో క్యాంప్‌ పెట్టించి మందు పంపిణీ చేయించారని, సాయంత్రానికి ఆనందయ్యను ప్రభుత్వం అదుపులోకి తీసుకుందని, అసలేం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అభద్రతా భావంలో ఉన్నప్పుడు భరోసా ఇచ్చేపరిస్దితి లేదన్నారు. రుయాలో ఆక్సిజన్‌ లేక 34 మంది చనిపోయారని పేర్లిస్తే 11 మందే అన్నారని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు హెచ్‌ఆర్‌సీవిచారణ చేస్తుంటే 23 మందికి పరిహారం ఇస్తామంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆనందయ్య మందును కూడా స్వార్ధం కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆనందయ్యను రహస్య ప్రదేశంలో ఉంచి మందు తయారు చేయించుకుంటున్నారని, దీన్ని సమర్ధించుకోలేని పరిస్దితుల్లో ప్రభుత్వం ఉందన్నారు.

 రెండేళ్లుగా స్టేట్‌ టెర్రరిజం

రెండేళ్లుగా స్టేట్‌ టెర్రరిజం

రాష్ట్రంలో పోలీసు, అధికార వ్యవస్ధ, ప్రభుత్వం అన్నీ కలిసి మాట్లాడేవాళ్ల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల్ని కాదని పరిషత్‌ ఎన్నికలు పెట్టారని, దీన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందన్నారు. నిష్పాక్షికంగా పనిచేయాల్సిన అధికారులు పక్షపాతం చూపుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అశ్విత్‌ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, బీటెక్‌ రవి, బీసీ జనార్ధన్‌రెడ్డి వంటి నేతల్ని అరెస్టు చేశారని,. ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజును సైతం పోలీసు కస్టడీలో దాడి చేయించారంటే పరిస్ధితి అర్ధమవుతోంది. రఘురామ విషయంలో అన్నింటినీ మ్యానిపులేట్ చేశారని,. బెయిల్‌ రాకుండా ఉండేలా కేసులు పెడ్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మాస్కులు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను హింసించి చంపేశారు

గతంలో కోడెలను కూడా ఇలాగే వేధించి చంపారన్నారు. ఇప్పటికీ రామకృష్ణ అనే జడ్జి జైల్లోనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
రెండేళ్లుగా స్టేట్‌ టెర్రరిజం కొనసాగుతూ ఉందని. సోషల్ మీడియాలో, పేపర్లలో మాట్లాడే వారిపై కేసులు పెడుతూనే ఉన్నారన్నారు.

 టీడీపీ క్యాడర్‌కు చెంద్రబాబు పిలుపు

టీడీపీ క్యాడర్‌కు చెంద్రబాబు పిలుపు

గత రెండేళ్లుగా టీడీపీ నేతలు ఎదుర్కొన్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేశాయని చంద్రబాబు తెలిపారు. నేతల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా దెబ్బతీసేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాల్సిందేనని, తప్పు చేసిన వ్యక్తులపై ప్రైవేట్‌ కేసులు వేసి న్యాయస్ధానాల్లో దోషులుగా నిలబెట్టాల్సిందేనని చంద్రబాబు క్యాడర్‌కు పిలుపునిచ్చారు. అప్పుడే వ్యవస్ధలో మార్పు వస్తుందన్నారు.

 ఇచ్చింది గోరంత దోచింది కొండంత

ఇచ్చింది గోరంత దోచింది కొండంత

సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. సంక్షేమం పేరుతో కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.. ఆ డబ్బు కరోనా వ్యాక్సిన్‌పై ఖర్చుపెట్టాలని కోరారు. సంక్షేమం పేరుతో మీరు తిస్తున్నారు, ఆ తర్వాత ఎంత దోచుకుంటున్నారనే దానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. మీరొక్కరే సీఎం కాదు, ఎంతో మంది ముఖ్యమంత్రులొస్తారని, సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని జగన్‌కు చంద్రబాబు హితవు పలికారు.

కోవిడ్ సమయంలో ప్రతీరోజూ నిత్యవసరాలు, ఇంటిపన్ను,కరెంటు పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పెట్రోలు ఛార్జీలు పెంచేశారని,. మరోవైపు విపరీతమైన అప్పులు తీసుకురావడం వల్ల రాష్ట్రంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. మధ్యతరగతి కూడా అప్పుల్లోనే ఉంది. ఆర్ధికంగా పరిస్దితులు తలకిందులవుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్దితి మరింత దిగజారబోతోంది.

 నా అనుభవంతో చెప్తున్నా.. జగన్‌లా చేస్తే

నా అనుభవంతో చెప్తున్నా.. జగన్‌లా చేస్తే

నా అనుభవంతో చెప్తున్నా, జగన్‌లా తప్పుడు పనులు చేసే వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ముందుకుపోవాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించిన వారు కాలగర్భంలో కలిసిపోయారని ఈ సందర్బంగా తెలిపారు. టీడీపీ ఓ వ్యవస్ధ అని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారని, టీడీపీ పవిత్ర సేవాభావానికి నిదర్శమని చంద్రబాబు అన్నారు.

  #TopNews : Yaas Cyclone Update | Mahesh Surprise On May 31 || Oneindia Telugu
  English summary
  annual event of telugu desam party mahanadu begins today. party chief chandrababu has made inaugural speech on various issues.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X