వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దర్శిలో వైసీపీకి షాక్- నగర పంచాయతీ టీడీపీ కైవసం-సొంతపార్టీ ఎమ్మెల్యే ఉన్నా

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాష్ట్రంలోని పలు చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ముందంజలో ఉంది. వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుప్పం సహా పలు మున్సిపాలిటీల్లో వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది. అయితే ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో మాత్రం వైసీపీకి చుక్కెదురైంది.

ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీగా మారిన తర్వాత తొలిసారిగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇక్కడ ఎన్నికలు జరిగిన 20 వార్డుల్లో విపక్ష టీడీపీ ఏకంగా 13 వార్డులు గెల్చుకుని సత్తా చాటుకుంది.వైసీపీకి కేవలం 7 వార్డులు మాత్రమే దక్కాయి. దీంతో దర్శిలో వైసీపీకి ఆశాభంగం తప్పలేదు. ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ అభ్యర్ధులు ఇక్కడ హవా కొనసాగించారు. స్ధానికంగా వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగేపాల్ ఉన్నప్పటికీ దర్శి నగర పంచాయతీలో వైసీపీ అభ్యర్ధులు ముందంజ వేయడంలో విఫలమయ్యారు.

tdp gives big shock to ysrcp in darsi municipality as ruling party confines to 6 seats only

ప్రకాశం జిల్లాలో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో వైసీపీకి టీడీపీ గట్టిపోటీ ఇస్తోంది. ఆ ప్రభావం దర్శి నగర పంచాయతీ ఎన్నికలపైనా కనిపించింది. తొలిసారి నగర పంచాయతీగా ఏర్పడిన దర్శిలో వైసీపీ ఆధిక్యం నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. పరిస్ధితులు చేజారుతుండటంతో స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఎన్నికల పోలింగ్ రోజు కూడా స్ధానికంగా హంగామా చేశారు. అయినా ఫలితం లేకపోయింది. నగర పంచాయతీ ఏర్పాటయ్యాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల్ని దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది.

మరోవైపు జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండటం, దర్శి నగర పంచాయతీలో టీడీపీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయడం, అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల మధ్య సఖ్యత కొరవడటం వంటి కారణాలతో అధికార పార్టీకి ఇక్కడ చుక్కెదురైనట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ప్రజా సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం జగన్ కు లేఖలు రాయడం, అధికార వైసీపీ .. విపక్ష టీడీపీని పూర్తిగా టార్గెట్ చేయడంతో సానుభూతి ప్రభావం కూడా పనిచేసిందని చెప్తున్నారు. ఏదేమైనా 2019 ఎన్నికల్లో ఘన విజయాలు, ఒంగోలు కార్పోరేషన్ ను తాజాగా గెల్చుకున్న వైసీపీకి ఇదో ఎదురుదెబ్బగా చెప్తున్నారు.

దర్శిలో వైసీపీ, టీడీపీ గెల్చుకున్నవార్డులివే

1, జగన్నాథం మోహన్ బాబు వైసిపి.

2, వేమిరెడ్డి చెన్నా రెడ్డి వైసిపి.

3, ఇత్తడి సునీత టిడిపి.

4, గర్నెపూడి స్టీఫెన్

5, తుళ్లూరు బాబురావు వైసిపి.

6, వెన్నపూస నారాయణమ్మ వైసిపి.

7, ఆవుల జ్యోతి వైసిపి.

8, మోహన్ రెడ్డి వైసిపి.

9, యనమల సరస్వతి వైసిపి.

10, పసుపులేటి శేషమ్మ టిడిపి.

11, నారంశెట్టి పిచ్చయ్య టిడిపి.

12, నక్క చంద్ర టిడిపి.

13, బత్తుల తిరుపతయ్య టిడిపి.

14, బత్తుల పద్మ టిడిపి.

15, కల్లూరి మహేశ్వరి టిడిపి.

17, పాణ్యం వల్లి బాబు టిడిపి.

16, తలారి కోటయ్య టిడిపి.

18, నారప్ప శెట్టి ధనలక్ష్మి టిడిపి.

19, దారం నాగవేణి టిడిపి.

20, కనకం మల్లేశ్వరి టిడిపి.

English summary
in big shock to ruling ysrcp in andhrapradesh as it losts darsi municipality election to tdp in today's announced results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X