రామ్ చరణ్ సంస్థకు.. నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్
అమరావతి : డిమాండ్ లేనిచోట సౌకర్యాల కల్పన అంటే.. ప్రభుత్వ ఖజానాపై భారం పడే వ్యవహారమే. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న టర్బో మెఘా ఎయిర్ వేస్ కు తాజాగా రూ.4.90 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.
ప్రయాణికులు ఉన్నా లేకున్నా.. విజయవాడ-తిరుపతి, విజయవాడ-కడప మధ్య విమాన సర్వీసులు నడపాలన్న ఒప్పందం మేరకు ఈ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఇందుకోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకాన్ని ప్రకటించింది. ప్రయాణికుల తాకిడి లేనిచోట విమాన సంస్థకు నష్టాలే మిగిలే అవకాశం ఉండడంతో.. నష్టాలను భరించి సైతం విమాన సర్వీసులను నడిపిస్తోంది ప్రభుత్వం.

విజయవాడ-తిరుపతి, విజయవాడ-కడప మధ్య ప్రస్తుతం వారానికి నాలుగు రోజుల పాటు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ టెండర్ ను హీరో రామ్ చరణ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న ట్రూ జెట్‌కు చెందిన టర్బో మెఘా ఎయిర్ వేస్ దక్కించుకుంది. ట్రూ జెట్ నడుపుతోన్న ఏటీఆర్-72 సర్వీసులు 72 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
వారంలో నాలుగు రోజులు ప్రయాణికులు లేకుండానే.. సర్వీసులు నడపడమంటే.. ఆర్థికంగా నష్టాలను మిగిల్చే వ్యవహారం కాబట్టి.. ప్రతీ విమాన సర్వీసులో ఐదు సీట్లను ప్రభుత్వానికి కేటాయిస్తూ ట్రూ జెట్ ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఏటా 672 సర్వీసులు నడిపిందుకు గాను ప్రభుత్వం ట్రూ జెట్ సంస్థకు రూ.9.76కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఆరు నెలల సర్వీసులకు సంబంధించి రూ.4.90 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications